Elon Musk: ఎలాన్ మస్క్ మాట్లాడుతుండగా.. మీటింగ్ నుంచి వెళ్లిపోయిన ట్విట్టర్ ఉద్యోగులు

సాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులు భౌతికంగా హాజరు కాగా, కొంత మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగుకు హాజరయ్యారు. అయితే వీరిని ఉద్దేశించి మస్క్ ప్రసంగిస్తున్నారు. ఇంతలో వీడియో కాన్ఫరెన్స్‭లో ఉన్నవారు ఒక్కొక్కరుగా మీటింగ్ నుంచి వెళ్లిపోతున్నారు. అయినా మస్క్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు

Elon Musk: ఎలాన్ మస్క్ మాట్లాడుతుండగా.. మీటింగ్ నుంచి వెళ్లిపోయిన ట్విట్టర్ ఉద్యోగులు

Twitter Employees Left Meeting As Elon Musk Continued Speaking

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్ననాటినుంచి కీలక మార్పులు చేస్తున్నారు. తొలిదశలోనే సంస్థలోని కీలక విభాగాల్లో సగం మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న మస్క్.. ఇటీవల 4వేల మందికిపైగా ఔట్ సోర్సింగ్ వర్కర్లను తొలగించాడు. ట్విటర్ నష్టాలను భర్తీచేసేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తుందని మస్క్ వివరించాడు. మరోవైపు ట్విటర్‌లో బ్లూటిక్, ఇతర విషయాల్లో తొందరపాటు నిర్ణయాలతో మస్క్ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఇదిలా ఉంటే.. మస్క్‭కు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. ట్విట్టర్ ఉద్యోగులతో ఆయన మాట్లాడుతుండగా మీటింగ్ నుంచి ట్విట్టర్ ఉద్యోగులు వెళ్లిపోయారట. ‘‘సాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులు భౌతికంగా హాజరు కాగా, కొంత మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగుకు హాజరయ్యారు. అయితే వీరిని ఉద్దేశించి మస్క్ ప్రసంగిస్తున్నారు. ఇంతలో వీడియో కాన్ఫరెన్స్‭లో ఉన్నవారు ఒక్కొక్కరుగా మీటింగ్ నుంచి వెళ్లిపోతున్నారు. అయినా మస్క్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు’’ అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

బుధవారం మస్క్ ఉద్యోగులకు ఓ ఇమెయిల్ పంపించారు. అంతకుముందు ఉద్యోగులు అధిక సమయం కష్టపడాలని, వారానికి తక్కువలో తక్కువ 80గంటలు కష్టపడాలని సూచించిన మస్క్.. బుధవారం ఉద్యోగులకు పంపించిన ఇమెయిల్‌లో ‘చాలా హార్డ్ కోర్’ గా ఉండాలని సూచించారు. అంటే ఎక్కువ గంటలు ఒత్తిడిని ఎదుర్కొని పనిచేయాలని, గురువారం సాయంత్రంలోగా తమ సమ్మతం తెలపాలని మస్క్ సూచించాడు. ఒకవేళ సమ్మతి తెలపని పక్షంలో మూడు నెలల గడువుతో ఉద్యోగాల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఆ ఇమెయిల్‌లో మస్క్ హెచ్చరికలు సైతం జారీ చేశాడు. మస్క్ తీరుతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలోని చాలా మంది ఉద్యోగులు ‘హార్డ్‌కోర్ వర్క్’ అల్టిమేటం తర్వాత వందలాది మంది తమ రాజీనామాలను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

Elon Musk: బైబై మస్క్ అంటున్న ఉద్యోగులు.. రిప్ ట్విట్టర్ అంటున్న యూజర్లు.. ఆందోళన లేదంటున్న మస్క్