Viral News: సముద్ర గర్భంలో భారీగా బంగారం గుర్తింపు ..

సముద్ర గర్భంలో భారీగా బంగారాన్ని కొలంబియా అధికారులు గుర్తించారు. దీని విలువ 17బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పానిష్ యుద్ధంలో మునిగిన రెండు నౌకలను తొలుత అధికారులు గుర్తించారు. ఈ నౌకట్లో తరలిస్తున్న బంగారం ప్రస్తుతం సముద్ర గర్భంలోని నాకల శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Viral News: సముద్ర గర్భంలో భారీగా బంగారం గుర్తింపు ..

New Ships

Viral News: సముద్ర గర్భంలో భారీగా బంగారాన్ని కొలంబియా అధికారులు గుర్తించారు. దీని విలువ 17బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పానిష్ యుద్ధంలో మునిగిన రెండు నౌకలను తొలుత అధికారులు గుర్తించారు. ఈ నౌకట్లో తరలిస్తున్న బంగారం ప్రస్తుతం సముద్ర గర్భంలోని నాకల శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Colombian

1708లోస్పానిష్ యుద్ధం జరిగింది. యుద్ధంలో బ్రిటీష్ నౌక‌లు జ‌రిపిన దాడిలో సాన్ జోస్ నౌక నీటి మునిగింది. ఆ నౌక‌లో సుమారు 600 మంది ఉన్నారు. వారితో పాటు బంగారు నాణాలు, ఆభ‌ర‌ణాలు, ఇంకా బంగారు సామాగ్రి ఉన్నాయి. అయితే 2015లో స్పానిష్ ప్రభుత్వం ఓడ నాశనానికి సంబంధించిన కొత్త ఫుటేజీని కొలంబియా అధికారులు విడుదల చేశారు.ఇందులో చెల్లాచెదురుగా విలువైన వస్తువులు ఉన్నాయి. వీడియో రిమోట్ కంట్రోల్డ్ వాహనం ద్వారా పరిశీలించగా ప్రధాన ఓడ శిథిలాల పక్కనే ఒక పడవ ఉంది. ఈ రెండు నౌకలు 200 ఏళ్ల నాటివని వాషింగ్టన్ పోస్ట్ తన నివేదికలో పేర్కొంది. రిమోట్‌తో నడిచే వాహనాన్ని కరేబియన్ తీరానికి 3,100 అడుగుల లోతుకు పంపినట్లు తెలిపింది.

Colambia

ఇందుకు సంబంధించిన చిత్రాలు చూస్తే.. నీలం, ఆకుపచ్చ రంగులలో ఉన్నాయి. సముద్రపు అడుగుభాగంలో చెల్లాచెదురుగా ఉన్న బంగారు నాణేలు, కుండలు, చెక్కుచెదరకుండా ఉన్న పింగాణీ కప్పులను కూడా అధికారులు గుర్తించారు. వివిధ రకాల మట్టి కుండలతో పాటు సముద్రగర్భంలో ఫిరంగి కూడా ఉన్నట్లు గుర్తించారు. నావికాదళం, ప్రభుత్వానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు శాసనాల ఆధారంగా వాటి మూలాన్ని గుర్తించేందుకు కృషి చేస్తున్నారని కొలంబియా అధికారులు తెలిపారు. అయితే వాటిని వెలికి తీసి శాన్ జోస్ గ్యాలియన్ యొక్క వారసత్వ సంపదను రక్షిస్తామని ప్రెసిడెంట్ ఇవాన్ డ్యూక్ అన్నారు.

Colambia (1)