Covid Vaccine For Children : అమెరికాలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం

అమెరికాలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభమైంది. 5-11 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫైజర్ టీకాలను ఇస్తున్నారు. పిల్లలకు టీకా అందుబాటులోకి రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం

Covid Vaccine For Children : అమెరికాలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం

Covid Vaccine

Covid Vaccine For Children అమెరికాలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభమైంది. 5-11 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫైజర్ టీకాలను ఇస్తున్నారు. పిల్లలకు టీకా అందుబాటులోకి రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నతల్లిదండ్రులు…తమ పిల్లలను వెంటబెట్టుకొని వ్యాక్సిన్ సెంటర్లకు తరలి వస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ సెంటర్లను చిన్నారులను ఆకట్టుకునేలా జంతువులు, కార్టూన్లతో ముస్తాబు చేశారు. కాలిఫోర్నియా, ఓహయో, న్యూయార్క్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది.

కాగా, 5-11 ఏళ్ల మధ్య పిల్లలకు ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గత వారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అమెరికాలో 11 ఏళ్లలోపు చిన్నారులకు ఆమోదం లభించిన తొలి వ్యాక్సిన్ ఇదే. FDA నిపుణుల బృందం సిఫార్సు మేరకు చిన్నారుల కోసం “కిడ్ సైజ్” డోసులను పంపిణీ చేసేందుకు CDC(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్) మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో బుధవారం నుంచి అన్ని రాష్ట్రాల్లో చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించారు. ఓ అంచనా ప్రకారం అమెరికాలో 5-11 ఏళ్ల మధ్య 2.8 కోట్ల మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ సరిపడా వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తామని అమెరికా ఫెడరల్ ప్రభుత్వం రాష్ట్రాలకు హామీ ఇచ్చింది.

ఇప్పటికే అమెరికాలో 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కొనసాగుతోండగా… తాజాగా 5-11 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది. వీరికి 10 మిల్లీగ్రాముల డోస్ ఇవ్వనున్నారు. సాధారంగా 12 ఏళ్లు, ఆపై వయస్సు గల వారికిచ్చే ఒక్కో డోస్‌లో 30 మిల్లీగ్రాములు ఔషధం ఉంటుంది. తక్కువ మోతాడు వల్ల దుష్ప్రభావాలు చాలా స్వల్పంగా ఉంటాయని ఎఫ్‌డీఏ‌లోని నిపుణుల బృందం పేర్కొంది. ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకునే యుక్త వయస్కుల్లో గుండె కండరాల వాపు లేదా మయోకార్డిటిస్ వంటి దుష్ప్రభావాలు తలెత్తినట్టు అధ్యయనంలో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్నారులకు తక్కువ మోతాదు ఇవ్వాలని సూచించారు. ఇక,చైనా, క్యూబా, యూఏఈ వంటి దేశాల్లో కూడా చిన్న పిల్లలకు టీకా అందుబాటులోకి వచ్చింది.

ALSO READ Russia : కుప్పకూలిన కార్గో విమానం.. ఏడుగురు మృతి