Russia : కుప్పకూలిన కార్గో విమానం.. ఏడుగురు మృతి

రష్యాలో కార్గో విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతులు బెలారస్, రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన వారుగా రష్యా అధికారులు గుర్తించారు.

Russia : కుప్పకూలిన కార్గో విమానం.. ఏడుగురు మృతి

Russia

Russia : రష్యాలో కార్గో విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతులు బెలారస్, రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన వారుగా రష్యా అధికారులు గుర్తించారు. బెలారస్ వైమానిక దళానికి చెందిన ఏఎస్ – 12 విమానం రష్యాలోని తృప్తు సెర్బియా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మొదట ల్యాండ్ చేయడానికి చూడగా వాతావరణం సరిగా లేకపోవడంతో వీలుకాలేదు.. రెండొవసారి ల్యాండింగ్ చేసే సమయంలో విమానం అదుపుతప్పి కుప్పకూలింది.

చదవండి : Russia-Covid 19: రష్యాను హడలెత్తిస్తున్న కరోనా..ఒక్క రోజులో 41,000 కేసులు

ఈ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని తెలుస్తోంది. ఇక విమానం కూలిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఘటనపై తూర్పుసెర్బియా పోలీసులు కేసు న‌మోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. టికెట్ల ఆధారంగా వారి స్వస్థలాలను గుర్తించామని వివరించారు అధికారులు.

చదవండి : Lockdown In Russia : రష్యాలో మళ్లీ కఠిన లాక్ డౌన్