UAE astronaut Sultan Al Neyadi : అంతరిక్షంలో తండ్రి.. భూమిపై కొడుకు.. మనసుని హత్తుకున్న ఇద్దరి సంభాషణ
భూమిపై ఇష్టమైనది ఏంటి నాన్నా? అని తండ్రిని కొడుకు అడిగితే ఆ తండ్రి 'నువ్వే' అని సమాధానం చెబుతాడు. ఇదే ప్రశ్న తండ్రి అంతరిక్షంలో ఉన్నప్పుడు.. అతని కొడుకు భూమి మీద నుంచి అడిగితే? అంతరిక్షంలో ఉన్నఓ ఆస్ట్రోనాట్.. భూమిపై ఉన్న అతని కొడుకు మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ చూడండి. మనసుని హత్తుకుంటుంది.

UAE astronaut Sultan Al Neyadi
UAE astronaut Sultan Al Neyadi : తండ్రి అంతరిక్షంలో.. కొడుకు భూమి మీద.. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న అరుదైన దృశ్యం. ఇది అందరికీ వచ్చే అవకాశం కాదు. యుఎఇ వ్యోమగామి సుల్తాన్ అల్ నేయాడి అతని కొడుకు అబ్దుల్లా సుల్తాన్ అల్ నేయాడిల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ద్వారా అంతరిక్ష యాత్రలో ఉన్న యుఎఇ వ్యోమగామి సుల్తాన్ అల్ నేయాడి తన కుమారుడు అబ్దుల్లా సుల్తాన్ అల్ నేయాడితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సోషల్ మీడియాలో వారి కాన్వర్సేషన్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (@MBRSpaceCentre) ట్విట్టర్లో షేర్ చేసింది. వీడియోలో అబ్దుల్లా తన తండ్రిని గౌరవ పూర్వకంగా పలకరిస్తూ ‘ఈ భూమిపై మీకు బాగా నచ్చేది ఏంటి?’ అని అడిగాడు. అందుకు సుల్తాన్ అల్ నేయాడి ‘నేను భూమిపై ఎక్కువగా ఇష్టపడేది నిన్నే’ అని తన కొడుకు పేరును ప్రస్తావిస్తూ ‘అంతరిక్షంలో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే .. ఇక్కడ మైక్రోగ్రావిటీ వాతావరణంలో ఉన్నాము. మీరు ఇష్టపడే పనులు మేము చేయగలం. ఒకచోటు నుంచి మరో చోటుకి ఎగరగలగడం’ అంటూ అక్కడ ఎగురుతూ ప్రాక్టికల్‌గా కొడుకుకి చూపించారు సుల్తాన్ అల్ నేయాడి.
Zinnia Flower : అంతరిక్షంలో పూసిన ‘జిన్నియా’ ఫ్లవర్.. ఫోటో షేర్ చేసిన నాసా
వ్యోమగామి సుల్తాన్ అల్ నేయాడి తండ్రితో పాటు అతని ఆరుగురు పిల్లల్లో ఇద్దరు ‘ఎ కాల్ ఫ్రమ్ స్పేస్’ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో అంతరిక్ష కేంద్రం నుండి స్పేస్ స్టేషన్ హెడ్స్, ఔత్సాహికులతో మాట్లాడారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘కొడుకు తండ్రిని చూసి గర్వపడే సందర్భం’ అని.. ‘గొప్ప సంభాషణ’ అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఆస్ట్రోనాట్ సుల్తాన్ అల్ నేయాడితో పాటు మరో నలుగురు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో 6 నెలల సైన్స్ మిషన్ పూర్తి చేసిన తరువాత సెప్టెంబర్ 1 న భూమికి రావడానికి సిద్ధమవుతున్నారు.
The son of astronaut Sultan AlNeyadi asked him a question about what he likes the most on Earth, during the event “A Call from Space” – Umm Al Quwain edition.#TheLongestArabSpaceMission pic.twitter.com/TIkDJR4ted
— MBR Space Centre (@MBRSpaceCentre) August 10, 2023