Variety Robbery : చిన్న చీటీముక్కతో కూల్ గా బ్యాంక్ రాబరీలు చేస్తున్న వృద్ధుడు

చిన్న చీటీతో కూల్ గా బ్యాంక్ రాబరీలు చేస్తున్నాడో 67 ఏళ్ల వృద్ధుడు. ఆ చీటీ చూసిన ఓ బ్యాంక్ క్యాషియర్ వణికిపోతూ క్యాష్ కౌంటర్ లో ఉన్న లక్షలు తీసి అతని చేతిలో పెట్టాడు.ఆ డబ్బు తీసుకుని కూల్ గా అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. మరి ఆ ముసలాయన ఆచీటీలో ఏం రాశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Variety Robbery : చిన్న చీటీముక్కతో కూల్ గా బ్యాంక్ రాబరీలు చేస్తున్న వృద్ధుడు

Bank Robbery

Man Attempt Of Bank Robbery Fails Due To His Handwriting : ఓ 67 ఏళ్ల ముసలాయన కొన్ని బ్యాంకులకు వెళ్లి క్యాషియర్ల చేతిలో ఓ చిట్టి పెడుతున్నాడు. అలా చిట్టీ ఇచ్చాక తాపీగా రెండు చేతులు రెండు ప్యాంటు చేబుల్లో పెట్టుకుని నిల్చుంటున్నాడు. ఓ బ్యాంకులో క్యాషియర్ ఆ చిట్టీలో ఏముందో తెలియక దాన్ని పక్కనపారేశాడు. మరో బ్యాంకు క్యాషియర్ మాత్రం ఆ చిట్టీ చదివి అర్థం అయ్యాక షాక్ అయ్యాడు.తరువాత క్యాష్ కౌంటర్లో ఉన్న దాదాపు రెండున్నర లక్షల క్యాష్ తీసి ఆ ముసలాయన చేతికి ఇచ్చేశాడు. ఆ డబ్బు పట్టుకుని అంతే తాపీగా బయటకు వెళ్లిపోయాడు పెద్దాయన..ఆ తరువాతే జరిగింది అసలు సీన్అంతా..ఇంతకీ ఆ ముసలాయన చిట్టీలో ఏం రాశాడో తెలుసుకుందాం..

అది 2021 సంవత్సరం మార్చి 18 తేదీ. ఇంగ్లాండ్‌ లోని హ్యాస్టింగ్స్‌లోని సేయింట్‌ యోనార్డ్స్‌కు చెందిన అలన్‌ స్లాటరీ అనే 67 ఏళ్ల వృద్ధు ఈస్ట్‌బోర్న్‌లో ఉన్న ఓ బ్యాంకులోకి వెళ్లాడు. నేరుగా క్యాషియర్‌ దగ్గరకు వెళ్లి అతడి చేతిలో ఓ చీటీ పెట్టాడు. తరవాత చాలా కూల్ గా రెండు ప్యాంట్స్‌ జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డాడు. ఆ చీటీని ఎడా పెడా చూసిన క్యాషియర్ కు ఏమీ అర్థం కాలేదు.దాన్ని చదవటానికి ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. దీంతో టైమ్ వేస్ట్ చేయటం ఎందుకనుకుని ఆ చీటీని పక్కన పెట్టేసి తన పనిలో మునిగిపోయాడు.

దీంతో అలన్‌ స్లాటరీ ఆ క్యాషియర్‌ వైపు ఓ సారి ఎగాదిగా చూసి అక్కడినుంచి వెళ్లిపోయాడు స్లాటరీ.ఆ తర్వాత కాసేపటికి స్లాటరీ ఇచ్చిన ఆ చీటి బిల్డింగ్‌ సిబ్బందిలో ఒకరి దగ్గరకు చేరింది. అది చదివిన వ్యక్తి ఆ ముసలాయన ఏం రాశాడో అర్థమై షాక్‌ అయ్యాడు. కానీ అతను అప్పటికే అక్కడ నుంచి వెళ్లిపోయాడని తెలుసుకున్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఆధారంగా స్లాటరీ కోసం అన్వేషణ ప్రారంభించారు.ఆ తరువాత కొన్నిరోజులు గడిచాయి. అది 2021, మార్చి 26తేదీ. స్లాటరీ ఈ సారి అదే బ్యాంకుకు చెందిన మరో బ్రాంచీకి వెళ్లాడు. గతంలో చేసినట్లే క్యాషియర్‌ దగ్గరకు వెళ్లి చీటీ అతడి చేతిలో పెట్టాడు. అది చదివిన క్యాషియర్‌ భయపడిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2,400 స్టెర్లింగ్‌ పౌండ్‌లు భారత్ కరెన్సీలో చూస్తే దాదాపు రెండున్నర లక్షలు అతడి చేతిలో పెట్టాడు. ఆ డబ్బు పట్టుకుని ముసలాయన బ్యాంకు బయటకు వచ్చాడు. ఆ తరువాత కొన్ని గంటల తర్వాత నాట్‌వెస్ట్‌లోని మరో బ్యాంకుకు వెళ్లాడు.

అక్కడ కూడా అదే పని. ఏదో దినచర్య అన్నట్లుగా. నేరుగా క్యాషియర్ దగ్గరకు వెళ్లి అతని చేతిలో ఓ చీటీని పెట్టాడు. చీటీని చదివిన సదరు క్యాషియర్‌ స్లాటరీపై సీరియస్‌ అయ్యాడు. దీంతో ఏమాత్రం మాట్లాడకుండా అంతేకూల్ గా అక్కడినుంచి బయటకు వచ్చేశాడు స్లాటరీ.అప్పటికే స్లాటరీ కోసం వెదుకుతున్న పోలీసులు ఈ మూడు బ్యాంకుల సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన స్లాటరీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. స్టాటరీని అతడి ఇంటి అడ్రస్ కూడా తెలుసుకుని అక్కడకు వెళ్లి అతడిని అరెస్ట్‌ చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు స్లాటరీకి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

ఇంతకీ ఆ చీటిలో ఏముందని తెలుసుకోవాలనే ఆతృత ఉంది కదూ..స్లాటరీ ఇచ్చిన చీటీలో ‘‘ నా దగ్గర పిస్టల్‌ ఉంది. మీ సీసీ కెమెరాల్లో ఈ విషయం తెలుస్తుంది. మిగిలిన కస్టమర్ల గురించి కూడా ఓ సారి ఆలోచించు. మర్యాదగా నేనడిగిన డబ్బు(10s.. 20s) ఇవ్వు’’ అని రాసి ఉంది.