UK MP : కత్తితో పలుమార్లు పొడిచి..బ్రిటన్ ఎంపీ దారుణ హత్య

బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమ్మెస్(69)శుక్రవారం ఓ చర్చిలో దారుణ హత్యకు గురయ్యారు.

UK MP : కత్తితో పలుమార్లు పొడిచి..బ్రిటన్ ఎంపీ దారుణ హత్య

Uk Mp

UK MP బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమ్మెస్(69)శుక్రవారం ఓ చర్చిలో దారుణ హత్యకు గురయ్యారు. తూర్పు ఇంగ్లాడ్ లోని ఎసెక్స్ కౌంటీలోని సౌతెండ్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ అమ్మెస్..శుక్రవారం మధ్యాహ్నాం లై ఆన్ సీ లోని బెల్ఫైర్స్ మెథడిస్ట్ చర్చలో ఓ మీటింగ్ లో పాల్గొన్నారు.

ఈ సమయంలో ఓ 25ఏళ్ల యువకుడు ఎంపీపై కత్తితో దాడికి పాల్పడ్డారు. పలుమార్లు ఎంపీని కత్తితో పొడిచాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుడిని అరెస్ట్ చేశారు. తీవ్రగాయాలతో పడి ఉన్న ఎంపీకి ఎమర్జెన్సీ సర్వీసెస్ ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చర్చిలోనే ఎంపీ కన్నుమూశారని పోలీసులు తెలిపారు.

ALSO READ కంపెనీలకు కొత్త టెన్షన్… ఉద్యోగాలకు లక్షలాది మంది రాజీనామా..