Great Resignation.. కంపెనీలకు కొత్త టెన్షన్… ఉద్యోగాలకు లక్షలాది మంది రాజీనామా..

లక్షలాది ఉద్యోగులు తమ కొలువులకు గుడ్ బై చెబుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’ సంక్షోభం..

Great Resignation.. కంపెనీలకు కొత్త టెన్షన్… ఉద్యోగాలకు లక్షలాది మంది రాజీనామా..

Great Resignation

Great Resignation : ది గ్రేట్ రిజిగ్నేషన్.. ఇప్పుడీ వ్యవహారం కంపెనీలకు వణుకు పుట్టిస్తోంది. యాజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికి కారణం ఉద్యోగుల రాజీనామాలు. అవును.. లక్షలాది ఉద్యోగులు తమ కొలువులకు గుడ్ బై చెబుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’ సంక్షోభం మొదలైంది.

ఎందుకు రాజీనామా చేస్తున్నారు..
యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పింది. సంస్థల్లో ఏళ్ల తరబడి నమ్మకంగా పని చేసినా కష్టకాలంలో యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వారి మనసును గాయపర్చింది. అధిక గంటలు పని, లే ఆఫ్‌లు, వేతన కోతలతో తమను కంపెనీలు ఎక్కువగా వాడుకుంటున్నాయన్న భావన ఉద్యోగుల్లో బలంగా నాటుకుంది. ఇది ఉద్యోగుల్లో మార్పు తెచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త మార్గం వెతుక్కునే పనిలో పడ్డారు. కంపెనీలు ఆకర్షణీయ వేతనాలు, ప్యాకేజీలు ఇస్తామన్నా ఉద్యోగులు ఉండటం లేదు. దీంతో కంపెనీలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అదే.. ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’… టెన్షన్..

Pizzas : పిజ్జాలు, చిప్స్ తింటున్నారా… అయితే మతిమరుపు వ్యాధి ఖాయం

ఏమిటీ రాజీనామాల సంక్షోభం..
‘ది గ్రేట్‌ రెజిగ్నేషన్‌’ అనే పదాన్ని తొలిసారి 2019లో ఏ అండ్‌ ఎం ప్రొఫెసర్‌ ఆంటోనీ క్లాట్జ్‌ ప్రయోగించారు. కొవిడ్‌ తర్వాత ఉద్యోగులు కోట్ల సంఖ్యలో తమ కొలువులకు రాజీనామా చేస్తారని భవిష్యత్తు గురించి అంచనా వేశారు. ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చింది. ఒక్క అమెరికాలోనే ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇది ఆ దేశ మొత్తం ఉద్యోగాల్లో 2.9 శాతం. కంపెనీలకు వెన్నులో చలి పుట్టించే మరో విషయాన్నీ ‘గాల్‌ అప్‌’ డేటా వెల్లడించింది. అమెరికాలో 50 శాతం మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం చురుగ్గా వేట మొదలు పెట్టారంది. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది ఉద్యోగులు కంపెనీలు మారడం లేదా రాజీనామాలపై ఆలోచిస్తున్నారని మైక్రోసాఫ్ట్‌ సర్వే పేర్కొంది.

ఏ రంగాల్లో ఎక్కువగా ఉంది?
ఉద్యోగుల రాజీనామాల పరంపర అన్ని రంగాల్లోనూ కనిపిస్తోంది. కొన్ని రంగాల్లో మాత్రం అత్యధికంగా ఉంది. ముఖ్యంగా రిటైల్‌, గోదాములు, రెస్టారెంట్లు, హెల్త్‌కేర్‌, సోషల్‌ అసిస్టెన్స్‌ రంగాల్లో రికార్డు స్థాయిలో ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ చెబుతున్నాయి. ముఖ్యంగా తక్కువ వేతనాలకు పనిచేస్తున్న ఉద్యోగులు తమ కంపెనీలకు గుడ్‌ బై చెప్పేస్తున్నారు. అసౌకర్యవంతమైన పని గంటలు, తక్కువ ప్రతిఫలంతో పని చేయడానికి చాలామంది ఇష్టపడం లేదు.

Vitamin B12 : విటమిన్ బి12 వల్ల కలిగే ప్రయోజనం తెలుసా?..

ఆగస్టులో నమోదైన రాజీనామాల్లో 40 శాతం రెస్టారెంట్లు, హోటళ్ల రంగంలోనే ఉన్నాయి. పంపిణీ వ్యవస్థలు దెబ్బతినడంతో ఒత్తిడి పెరిగిపోయి తయారీ, గోదాముల్లోని పని వారు కూడా ఉద్యోగాలను వదిలేస్తున్నారు. కొందరు ఏకంగా తమ కంపెనీల తీరుపై సోషల్‌ మీడియాల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. #QuitMyJob వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్లో ట్రెండ్‌ అవుతున్నాయి. అమెరికాలో భారీ సంఖ్యలో మహిళలు కొలువులను వీడుతున్నట్లు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ సర్వే గణంకాలు చెబుతున్నాయి.

ఉద్యోగులు పని వాతావరణానికి ప్రాధాన్యమివ్వడం కూడా రాజీనామాలకు కారణంగా మారుతోంది. ‘స్టేట్‌ ఆఫ్‌ వర్క్‌ ఇన్‌ అమెరికా’ సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగులు సౌకర్యవంతంగా ఉండే కొలువు కోసం వేతన పెంపును కూడా వదులుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ సర్వే చెబుతోంది.

కంపెనీలకు ఇబ్బందులే..
ఇప్పటికే ఉన్న నిరుద్యోగానికి తోడు కొత్తగా ఈ రాజీనామాల సునామీ కూడా చేరింది. అమెరికాలో ఆగస్టులో 1.4 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిపై చిన్న వ్యాపారాల యజమానులు పూర్తిగా నిరాశతో ఉన్నట్లు నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండిపెండెంట్‌ బిజినెస్‌ సర్వే తెలిపింది. ఉద్యోగులను కాపాడుకునేందుకు ఇప్పుడు చాలా కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయని ప్రొఫెసర్‌ ఆంటోనీ క్లాట్జ్‌ తెలిపారు. యూరప్ ఖండంలో కొవిడ్‌ సంబంధిత రాజీనామాలు అత్యధికంగా జర్మనీలో ఉన్నాయి. మొత్తం ఆరు శాతం మంది ఉద్యోగులు కొలువులను వదిలేశారు. ఆ తర్వాత 4.7 శాతంతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌, 2.9 శాతంతో నెదర్లాండ్స్‌, 2.3 శాతంతో ఫ్రాన్స్‌, 1.9 శాతంతో బెల్జియం ఉన్నాయి.