UK Nurses Strike : 106 ఏళ్ల చ‌రిత్ర‌లో మొద‌టిసారి..యూకేలో జీతాలు పెంచాలని నర్సుల దర్నా.. విధులు బహిష్కరించిన లక్ష మంది సిబ్బంది

 ఓ పక్క ఆర్థిక మాంద్యంతో వచ్చిన ఆర్థిక సంక్షోభంతో బ్రిటన్ అతలాకుతలవుతోంది. ఇదే సమయంలో బ్రిటన్ లో నిరసన గళాలు వినిస్తున్నాయి. దాదాపు లక్ష మంది నర్సులు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. రాయల్‌ కాలేజీ ఆఫ్ న‌ర్సింగ్‌కు చెందిన‌ న‌ర్సులు బ్రిటన్ వ్యాప్తంగా ధర్నా చేశారు. 106 ఏళ్ల చరిత్రలో రాయల్‌ కాలేజీ ఆఫ్ న‌ర్సింగ్‌ క్యాంపస్ నుంచి ధర్నా చేయటం ఇదే తొలిసారి.

UK Nurses Strike : 106 ఏళ్ల చ‌రిత్ర‌లో మొద‌టిసారి..యూకేలో జీతాలు పెంచాలని నర్సుల దర్నా.. విధులు బహిష్కరించిన లక్ష మంది సిబ్బంది

UK nurses unprecedented strike

UK nurses unprecedented strike : ఓ పక్క ఆర్థిక మాంద్యంతో వచ్చిన ఆర్థిక సంక్షోభంతో బ్రిటన్ అతలాకుతలవుతోంది. ఇదే సమయంలో బ్రిటన్ లో నిరసన గళాలు వినిస్తున్నాయి. దాదాపు లక్ష మంది నర్సులు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. రాయల్‌ కాలేజీ ఆఫ్ న‌ర్సింగ్‌కు చెందిన‌ న‌ర్సులు బ్రిటన్ వ్యాప్తంగా ధర్నా చేశారు. 106 ఏళ్ల చరిత్రలో రాయల్‌ కాలేజీ ఆఫ్ న‌ర్సింగ్‌ క్యాంపస్ నుంచి ధర్నా చేయటం ఇదే తొలిసారి కావటం గమనించాల్సిన విషయం. ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని..తమకు కనీసం ఐదు శాతం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం (డిసెంబర్ 14,2022) గ్రేట్ బ్రిటన్ లోని ఇంగ్లండ్, వేల్స్‌, ఉత్త‌ర ఐర్లాండ్‌కు చెందిన న‌ర్సులు విధులు బహిష్కరించి ధ‌ర్నా చేపట్టారు.

తాము 10 సంవత్సాల నుంచి రిటైర్మెంట్ కోతలు ఎదుర్కొంటున్నామని..పని ఒత్తిడితో సతమతమవతున్నామని..కానీ జీతం మాత్రం ఏమాత్రం పెరగటంలేదని తక్కువ జీతాలతో చాలా కష్టపడుతున్నామని వాపోతున్నారు నర్సులు. ప్రభుత్వం తమ కష్టాలు అర్థం చేసుకుంటుందని ఇప్పటి వరకు తాము ఎదురు చూశామని కానీ ప్రభుత్వానికి అవేమి పట్టటంలేదని అందుకే ధర్నా చేపట్టామని ఓ సీనియర్ నర్సు తెలిపారు.

కాగా..రాయల్‌ కాలేజీ ఆఫ్ న‌ర్సింగ్‌కు చెందిన‌ న‌ర్సులు ధర్నా చేయటం జీతాలు పెంచాలని ధర్నా కోసం రోడ్కెక్క‌డం యూకే 106 ఏళ్ల చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి కావటం గమనించాల్సిన విషయం. నర్సులు చేపట్టిన ధర్నాకు మద్దుతుగా దాదాపు ల‌క్ష మంది విధుల‌ను బహిష్కరించారు. కానీ అత్యవసర చికిత్సలను మాత్రం చేస్తామని నర్సులు తెలిపారు. రోగులకు సేవ చేయటానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఎమర్జీన్సీ కేసులను పరిగణలోకి తీసుకున్నామని..ఒక్క రోజు సమ్మెతో ఏ రోగికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని యూనియన్ స్పష్టంచేసింది.

కీమోథెర‌పీ, డ‌యాల‌సిస్, ఐసీయూ వంటి ఎమర్జీన్సీ సర్వీసులకు అటెండ్ అయ్యామని ఆ రోగులకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని తెలిపారు. కానీ రోగులకు తగినంత సిబ్బంది లేదక ఓవర్ డ్యూటీలతో పని ఒత్తిడికి గురి అవుతున్నామని వాపోయారు నర్సులు. కష్టానికి తగిన జీతాలు కోరటం స్వార్థం కాదని ఇది తమ హక్కు అని చెబుతోంది నర్సుల యూనియన్.

ఆర్థిక మాంద్యంలో ఉన్న బ్రిట‌న్ పౌరులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈక్రమంలో నర్సుల ధర్నా కొత్త సమస్యలా తయారైంది బ్రిటన్ ప్రభుత్వానికి. దీంతో నర్సుల డిమాండ్ నెరవేర్చే పరిస్థితుల్లో ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో నర్సుల డిమాండ్స్ ను నెరవేర్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని ఆరోగ్య శాఖా మంత్రి స్టీవ్ బార్ల్కే గురువారం (15,2022) స్పష్టంచేశారు.