Zhelensky : యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక నిర్ణయం..వీసా ఉంటేనే రష్యా పౌరులకు అనుమతి

నాలుగు నెలలుగా యుక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా చొరబాటును నిలువరించేలా ఆదేశ పౌరులకు జెలెన్‌స్కీ వీసా విధానాన్ని ప్రకటించారు.

Zhelensky : యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక నిర్ణయం..వీసా ఉంటేనే రష్యా పౌరులకు అనుమతి

Zhelensky

Ukrainian Zhelensky : యుక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీసాలు ఉంటేనే రష్యా పౌరులను తమ దేశంలోకి అనుమతించనున్నట్టు ప్రకటించారు. జులై ఫస్ట్‌ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని జెలెన్‌స్కీ అన్నారు. రష్యా, యుక్రెయిన్‌ పౌరులు ఇంతకుముందు ఎలాంటి వీసాలు లేకుండానే ఇరు దేశాలకు వెళ్లేవారు. అయితే యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నాలుగు నెలలుగా యుక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా చొరబాటును నిలువరించేలా ఆదేశ పౌరులకు జెలెన్‌స్కీ వీసా విధానాన్ని ప్రకటించారు. 1991లో సోవియట్‌ యూనియన్‌ నుంచి యుక్రెయిన్‌ స్వాతంత్ర్యం పొందిన తర్వాత నుంచి కొనసాగుతున్న రష్యన్‌ పౌరుల వీసా రహిత రాకపోకలకు ఈ చర్య ముగింపు పలకనుంది.

Russian vs Ukraine war: రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పాస్ పోర్టుల జారీ.. యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే..

మరోవైపు తమ 27 దేశాల కూటమిలో చేరేలా దరఖాస్తూ చేసుకునేందుకు యుక్రెయిన్‌కు అవకాశం ఇవ్వాలని యూరోపియన్‌ యూనియన్‌ కార్య నిర్వాహఖ విభాగం సిఫారసు చేసింది. ఇది యుక్రెయిన్‌కు ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ.. ఈ అధికార ప్రక్రియ పూర్తికావడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశముంది.

యుక్రెయిన్‌ ధరఖాస్తుకు ఈయూ కూటమిలోని అన్ని దేశాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈయూ సిఫారసులపై అవగాహన ఉన్నప్పటికీ వెనక్కి తగ్గని రష్యా….. యుక్రెయిన్‌ఫై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే జెలెన్‌స్కీ వీసా నిబంధన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.