Dawood Ibrahim: పాక్ మహిళలను రెండో వివాహం చేసుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం..

దావూద్ మొదటి భార్య మైజాబిన్ భారత్‌లోని దావూద్ బంధువులతో వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడుతూనే ఉంటుందని అలీషా చెప్పాడు. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉంటున్నాడని, కరాచీలోని డిఫెన్స్ కాలనీ ఘాజీ బాబా దర్గా ఏరియాలో ఉంటున్నాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో అలీషా వెల్లడించాడు.

Dawood Ibrahim: పాక్ మహిళలను రెండో వివాహం చేసుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం..

Dawood Ibrahim

Dawood Ibrahim: భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం రెండో వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన పఠాన్ మహిళలను వివాహం ఆడినట్లు దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు వెల్లడించారు. అయితే, తన మొదటి భార్య మైజాబిన్‌కు దావూద్ ఇబ్రహీం విడాకులు ఇచ్చాడన్న వార్తల్లో నిజంలేదని, మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు. ఈ విషయాన్ని దావూద్ మొదటి భార్య మైజాబిన్‌ను 2022 సంవత్సరంలో నేను కలిసి సమయంలో చెప్పిందని అలీషా పార్కర్ తెలిపాడు.

Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను అప్పగిస్తారా? పాక్ అధికారి ఏం చెప్పాడంటే

దావూద్ మొదటి భార్య మైజాబిన్ భారత్‌లోని దావూద్ బంధువులతో వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడుతూనే ఉంటుందని అలీషా చెప్పాడు. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉంటున్నాడని, కరాచీలోని డిఫెన్స్ కాలనీ ఘాజీ బాబా దర్గా ఏరియాలో ఉంటున్నాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో అలీషా వెల్లడించాడు. టెర్రర్ ఫండింగ్ కేసులో విచారణ జరిపిన ఎన్ఐఏ అధికారులు అలీషా పార్కర్ ను గతంలోనే ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ ను అధికారులు తాజాగా దాఖలు చేశారు. అందులో అలీషా చెప్పిన విషయాలను పొందుపర్చారు.

Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీంపై రూ.25లక్షల నగదు రివార్డును ప్రకటించిన ఎన్ఐఏ.. అతని అనుచరులపై కూడా..

దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో ఉన్నాడని పాక్ కొత్త విదేశాంగ మంత్రి బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టోను ప్రశ్నించినప్పుడు ఈ విషయాన్ని ఖండించారు. మోస్ట్ వాటెండ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్ డిసెంబర్ 1995లో మహారాష్ట్రంలో రత్నగిరి జిల్లాలో జన్మించాడు. అతని తండ్రి ఇబ్రహీం కస్కర్ పోలీసు కానిస్టేబుల్. తరువాత దావూద్ ఇబ్రహీం కుటుంబం ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో స్థిరపడింది.