Minister Jaishankar: హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యలు గుర్తుచేస్తూ.. పాక్‌పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి జైశంకర్
ఓ దశాబ్దం క్రితం హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆమె పాకిస్థాన్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు .. అవి కేవలం పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించకూడదు.. చివరికి అవి వారిని కూడా కాటేస్తాయి అని చెప్పారు.

Minister Jaishankar
Minister Jaishankar: అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్‌పై భారత విదేశీ వ్యవహాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి నిప్పులు చెరిగారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నిన్న పాక్, చైనాల తీరుపై జైశంకర్ మండిపడ్డ విషయం విధితమే. తాజాగా ఐరాస భద్రతా మండలిలో ‘ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ ప్రపంచం అవలంభించాల్సిన విధానాలపై’ భారత్ అధ్యక్షతన చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఇటీవల పాకిస్థాన్ మంత్రి భారత్ ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ ను ప్రశ్నించగా.. హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు.
ఓ దశాబ్దం క్రితం హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆమె పాకిస్థాన్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు .. అవి కేవలం పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించకూడదు.. చివరికి అవి వారిని కూడా కాటేస్తాయి అని చెప్పారు. కానీ, పాక్‌కు మంచి సూచనలు పాటించే అలవాటు లేదు. ఫలింగా ప్రస్తుతం ఆ దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అంటూ జైశంకర్ దాయాది దేశంపై నిప్పులు కురిపించారు.
Jaishankar In Saudi: సౌది అరేబియా రాజుతో సమావేశమైన విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్
ఉగ్రవాదం ఎక్కడి నుంచి మొదలైందన్న విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. రెండేళ్లపాటు మన ఆలోచనలన్నీ కరోనా చుట్టూరే తిరిగినా ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడ అనే విషయాన్ని మర్చిపోటానికి ప్రజలు తెలివి తక్కువ వారు కాదు అంటూ పాక్ కు చురకలు అంటించారు. ఇతరులపై నిందలు వేయడం మానుకోని, ముందు తామేంటో గుర్తు చేసుకోవాలి అంటూ పాకిస్థాన్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.