Uyghurs in China: చైనాలో “ఉయ్ఘర్స్ నిర్బంధ శిబిరాలు”: జింజియాంగ్ ప్రాంతంలో యూఎన్ ప్రతినిధి పర్యటన
చైనా చర్యలను గమనించ సాగిన యూఎన్ మానవహక్కుల హై కమిషన్ మిచెల్ బాచెలెట్ మంగళవారం జింజియాంగ్ ప్రాంతంలో పర్యటనకు వచ్చారు

Uyghurs in China: వాయువ్య చైనాలోని జింజియాంగ్(Xinjiang) ప్రాంతంలో ఉయ్ఘర్స్ ముస్లింలు(Uyghurs), మైనారిటీ వర్గాలను చైనా ప్రభుత్వం ఊచకోత కొస్తుందంటూ ప్రచారంలో ఉన్న వార్తలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జింజియాంగ్(Xinjiang) ప్రాంతంలో లక్షలాది మంది ఉయ్ఘర్స్ ముస్లింలు, టర్కిక్ మైనార్టీలు, కజక్ మైనారిటీలను చైనా సామూహిక నిర్బంధం చేసినట్లు గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉయ్ఘర్లను నిర్బంధించిన చైనా అధికారులు..వారిని చిత్రహింసలకు గురిచేసి..బలవంతపు శ్రమలోకి దించుతున్నారని..అక్కడి నుంచి తప్పించుకున్న వారిని పట్టుకుని నిర్దాక్షిణ్యంగా చైనా అధికారులు కాల్చి చంపుతున్నట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. జింజియాంగ్(Xinjiang) ప్రాంతంలోని ఉయ్ఘర్స్ పై చైనా నరమేధం సృష్టించిందని, వేలాది మంది ముస్లిం మైనారిటీలను బ్రతికుండగానే చితిమంటల్లో వేసి చైనా అధికారులు కాల్చి చంపారంటూ అమెరికా సైతం చెప్పుకొచ్చింది.
Other Stories:Monkeypox : ప్రపంచానికి మంకీపాక్స్ ముప్పు తప్పదా?కరోనాను మించిన పరిస్థితులు చూడబోతున్నామా?
అయితే చైనా మాత్రం అటువంటిదేమీ లేదంటూ చెప్పుకొచ్చింది. జింజియాంగ్(Xinjiang) ప్రాంతంలో ఉన్న మైనారిటీ వర్గాలకు వృత్తి నైపుణ్య శిక్షణ, చదువు చెప్పించడం సహా వారు నివసించేందుకు గదులు కూడా కట్టి ఇచ్చినట్లు చైనా పేర్కొంది. ఉయ్ఘర్స్ కి శిక్షణ ఇచ్చి వారితో జీతాల ప్రాతిపదికన పని మాత్రమే చేయించుకుంటున్నట్లు చైనా తెలిపింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్..చైనా చర్యలను నిశితంగా పరిశీలించింది. వాయువ్య ప్రాంతంలో జింజియాంగ్(Xinjiang) ప్రాంతాన్ని చైనాలోనే అత్యంత రహస్యాత్మక ప్రాంతంగా చెప్పుకుంటారు. 2008 నుంచి ఇక్కడ మైనారిటీ వర్గాలను బంధించిన చైనా వారితో గొడ్డు చాకిరీ చేయిస్తుందనేది ప్రపంచానికి తెలిసిన బహిరంగ రహస్యం. అయితే చైనా అధికారులు పెట్టె చిత్రహింసలు తట్టుకోలేక అనేకమంది మైనార్టీలు నిర్బంధ గృహాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
other stories:PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ
అటువంటి వారందరిని కాల్చి చంపేవారని జింజియాంగ్ ప్రాంతంలో పనిచేసిన ఒక బహిష్కృత చైనా పోలీస్ అధికారి అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. ఈనేపథ్యంలోనే చైనా చర్యలను గమనించ సాగిన యూఎన్ మానవహక్కుల హై కమిషన్ మిచెల్ బాచెలెట్ మంగళవారం జింజియాంగ్ ప్రాంతంలో పర్యటనకు వచ్చారు. సోమవారం అమెరికా నుంచి చైనాకు చేరుకున్న ఆమెకు చైనా విదేశాంగ మంత్రి స్వాగతం పలికి పర్యటన వివరాలు వెల్లడించారు. యూఎన్ మానవహక్కుల హై కమిషన్ మిచెల్ బాచెలెట్..వాయువ్య చైనా ప్రాంతంలోని కాశగర్, ఊర్ముకీ ప్రాంతాల్లో ఆరు రోజుల పాటు పర్యటించనున్నారు. ఉయ్ఘర్ల నిర్బంధం, మైనార్టీల ఊచకోత, ఇతర మానవహక్కుల ఉల్లంఘన వంటి విషయాలపై మిచెల్ లోతుగా పరిశీలించనున్నారు.
other stories:COVID Cases In India: దేశంలో తగ్గిన కరోనా కేసులు
అయితే జింజియాంగ్(Xinjiang) ప్రావిన్స్ లో యూఎన్ మానవహక్కుల హై కమిషన్ మిచెల్ బాచెలెట్ పర్యటనపై చైనా విదేశాంగ కార్యదర్శి స్పందిస్తూ..ప్రస్తుతం కరోనా కారణంగా అక్కడ నెలకొన్న పరిస్థితులు కొంత గందరగోళానికి గురిచేయవచ్చని..ఆ అంశాలపై మిచెల్ స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవాలని అన్నారు. ఇక ఈపర్యటనపై చైనా విదేశాంగమంత్రి వాన్గ్ యి స్పందిస్తూ..ఒకరకంగా జింజియాంగ్(Xinjiang) ప్రావిన్స్ లో యూఎన్ మానవహక్కుల హై కమిషన్ మిచెల్ బాచెలెట్ పర్యటించడం మంచిదేనని అన్నారు.
other stories:Minister Mukhtar Abbas Naqvi : ‘కాంగ్రెస్ పార్టీ ఉనికి వెంటిలేటర్ పై ఉంటే..ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సిలరేటర్ మీద ఉంది..’
దీంతో ఇక్కడ జరుగుతన్న విషయాలపై ప్రపంచ దేశాలకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాన్గ్ యి చెప్పారు. కాగా, జింజియాంగ్(Xinjiang) ప్రావిన్స్ లో మిచెల్ బాచెలెట్ పర్యటన సందర్భంగా చైనా అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. నిర్బంధ గృహాల్లో నిర్బంధించిన సుమారు 10 లక్షల మంది ముస్లిం మైనారిటీ ప్రజలను చైనా అధికారులు మరొక రహస్య ప్రాంతాలకు తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి. మిచెల్ పర్యటనను సైతం చైనా ప్రభుత్వం తమ పూర్తి నియంత్రణలో కొనసాగిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కాగా, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్, యూదులను ఊచకోత కోసినట్లుగా..అదే స్థాయిలో నేడు మైనారిటీ వర్గాలను చైనా ఊచకోత కోస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
1Nithya Menen : నిత్యామీనన్ కి ఏమైంది.. ఈవెంట్ లో స్టిక్‌తో నడుస్తున్న నిత్యా..
2Maharashtra Crisis: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు
3Vadodara Girl: పెంపుడు కుక్క చనిపోయిందనే బెంగతో చిరుతను తెచ్చుకున్న యువతి
4Lakshminarasimha Swamy Temple : అరటి గెల కడితే చాలు..కోరిన కోర్కెలు తీర్చే..చెట్లతాండ్ర లక్ష్మీనృసింహ స్వామి..
5Manchu Mohanbabu: నేను ఏమీ మాట్లాడను.. నన్ను వదిలేయండి.. కోర్టుకు హాజరైన మంచు కుటుంబం..
6Bonalu : రెండేళ్ల తరువాత జరిగే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
7Congress vs TRS: రసవత్తరంగా భద్రాద్రి జిల్లా రాజకీయం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సవాళ్లు
8Ketika Sharma : రంగరంగ వైభవంగా.. కేతిక ఏంటమ్మా ఇంత అందంగా..
9Russian Gold Ban : అగ్ర దేశాల నుంచి ఆంక్షలు..పెరుగుతున్న వడ్డీలు..100 ఏళ్ల తరువాత పీకల్లోతు సమస్యల్లో రష్యా
10Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్
-
Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
-
Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్‌ఖైదా కుట్ర
-
Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం
-
CM KCR : నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
-
Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?