Minister Mukhtar Abbas Naqvi : ‘కాంగ్రెస్ పార్టీ ఉనికి వెంటిలేటర్ పై ఉంటే..ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సిలరేటర్ మీద ఉంది..’

 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్‌లో బీజేపీ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి వెంటిలేటర్‌పై ఉంటే.. ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సిలరేటర్‌పై ఉందంటూ ఎద్దేవా చేశారు.

Minister Mukhtar Abbas Naqvi : ‘కాంగ్రెస్ పార్టీ ఉనికి వెంటిలేటర్ పై ఉంటే..ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సిలరేటర్ మీద ఉంది..’

Minister Mukhtar Abbas Naqvi

Minister Mukhtar Abbas Naqvi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్‌లో బీజేపీ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి వెంటిలేటర్‌పై ఉంటే.. ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సిలరేటర్‌పై ఉందంటూ ఎద్దేవా చేశారు. మంత్రి నఖ్వీ సోమవారం (మే 23,2022) హజ్ ఓరియంటేషన్ కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడంపై ఉన్న మోజు భారతదేశ పరువు తీసే కుట్ర స్థాయికి చేరుకుందని ఆరోపించారు. ద్వేషాన్ని వ్యాప్తి చేయడమే భాజపా సిద్ధాంతం అంటూ విరుచుకుపడ్డారు.

ప్రతికూల భూస్వామ్య మనస్తత్వం కారణంగా కాంగ్రెస్ పార్టీ స్థానికంగా కూడా సరైన రీతిలో లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన భావజాలంతో పోరాడకుండా.. ఆ పార్టీలో నేతల ప్రమాదకర మూర్ఖత్వంతో పోటీ పడుతోందని అంటూ విమర్శించారు. కాంగ్రెస్ ఓ కుటుంబ ఫొటో ప్రేమ్ లో స్థిరపడిపోయిందని..ఓ నకిలీ కిట్టీ పార్టీగా పరిమితమైపోయిందని ఎద్దేవా చేశారు మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.

Also read : Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

కాంగ్రెస్ నేతలు పరాయి దేశానికి వెళ్లి మన దేశపు పరువు తీస్తున్నారని ఇటీవల యూకేలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కొన్నిసార్లు భారత్‌ను పాకిస్థాన్, శ్రీలంక, ఇతర దేశాలతో పోలుస్తారని..మరికొన్ని సార్లు వారు దేశంలో భయం..ద్వేషం కలుగజేస్తుంటారన్నారు. భారతదేశాన్ని పరువు తీయడానికి..సామరస్యాన్ని దెబ్బతీస్తుంటారు అంటూ మంత్రి నఖ్వీ తీవ్ర విమర్శలు చేశారు.ఇటువంటి వారి ఆలోచనలు కాంగ్రెస్ నేతల అజ్ఞానం, మూర్ఖత్వానికి స్పష్టంగా అద్దం పడుతుందని మంత్రి అన్నారు.

కాగా.. ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. భారత్ లో ప్రస్తుత పరిస్థితులు అంతగా బాగోలేదని, ప్రధాని మోదీ దేశంలో సమస్యలను వినే వైఖరిలో లేరని అన్నారు. భారత రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, ఫలితంగా భారతదేశంలోని రాష్ట్రాలు..కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేకపోతున్నాయని రాహుల్ అన్నారు. సమస్యలను లేవనెత్తినప్పుడు బీజేపీ గట్టిగా మాట్లాడి తమ నోర్లు మూయిస్తుందని, ప్రశ్నించిన గొంతుకలను అణిచివేస్తుందని రాహుల్ ఆరోపించారు. దేశంలో పరిస్థితులపై “నేను వినాలనుకుంటున్నాను” అనే వైఖరి ప్రదర్శించాల్సిన ప్రధాన మంత్రి అందుకు విరుద్ధంగా ఎటువంటి విషయాలను వినే స్థితిలో ఆయన లేరంటూ ప్రధాని మోదీ పై ఘాటు విమర్శలు చేశారు. భారత్ తో ప్రజలకున్న అనుబంధాన్ని తాము విశ్వసిస్తున్నామని రాహుల్ అన్నారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కాంగ్రెస్ పార్టీ ఉనికి వెంటిలేటర్‌పై ఉంటే.. ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సిలరేటర్‌పై ఉందంటూ ఎద్దేవా చేశారు.