Monkeypox : ప్రపంచానికి మంకీపాక్స్ ముప్పు తప్పదా?కరోనాను మించిన పరిస్థితులు చూడబోతున్నామా?
కరోనా పీడ నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న బతుకులను.. ఇప్పుడు కొత్త భయం కమ్మేసింది. ఇదెక్కడి రోగం మహాప్రభో అన్నట్లుగా మంకీపాక్స్ విస్తరిస్తోంది. ప్రపంచమే కుగ్రామం అయిన ఈ తరుణంలో ఆసియా వరకు వైరస్ వచ్చేసింది. దీంతో భారత్‌లోనూ అప్రమత్తత కనిపిస్తోంది. ఇంతకీ ఏంటీ మంకీపాక్స్.. ప్రపంచం ఇంతలా ఎందుకు భయపడుతోంది.. ?

WHO expects more monkeypox cases globally : కరోనా పీడ నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న బతుకులను.. ఇప్పుడు కొత్త భయం కమ్మేసింది. ఇదెక్కడి రోగం మహాప్రభో అన్నట్లుగా మంకీపాక్స్ విస్తరిస్తోంది. ప్రపంచమే కుగ్రామం అయిన ఈ తరుణంలో ఆసియా వరకు వైరస్ వచ్చేసింది. దీంతో భారత్‌లోనూ అప్రమత్తత కనిపిస్తోంది. ఇంతకీ ఏంటీ మంకీపాక్స్.. ప్రపంచం ఇంతలా ఎందుకు భయపడుతోంది.. వైరస్ సోకితే ఇక అంతేనా..అసలీ వైరస్ లక్షణాలు ఏంటి.. ?
కరోనాలో చిక్కుకొని అల్లాడిపోయిన ప్రపంచం హమ్మయ్యా అని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. మరో మహమ్మారి కాటేసేందుకు కోరలు చాచుకొని సిద్ధంగా ఉంది. మరో ప్రమాదకర వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అదే మంకీపాక్స్. ఈ కేసులు చాలా దేశాల్లో ఆందోళనకరంగా పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇస్తోంది. బ్రిటన్‌లో మొదట్లో కోతులకు సంక్రమించే మంకీపాక్స్ వ్యాధిని.. ఇప్పుడు మనుషులకు సోకినట్టు గుర్తించారు. ఆ తర్వాత కెనడా, స్పెయిన్ సహా 13 కంటే ఎక్కువ దేశాలలో వైరస్ కేసులు ప్రస్తుతం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని రిపోర్టులు చెప్తున్నాయ్. నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, యూకే, అమెరికాలలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయ్. ప్రస్తుత పరిస్థితులు ఇలానే కొనసాగితే.. మంకీపాక్స్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని WHO తెలిపింది.
ఈక్రమంలో కరోనాకు భిన్నంగా మంకీపాక్స్ వ్యాపిస్తోంది. ఇప్పటివరకు మనదేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినా.. క్రమంగా వివిధ దేశాల్లో వైరస్ వ్యాప్తి చెందడం జనాలు గుండెల్లో భయం పుట్టిస్తోంది. వైరస్ ప్రభావిత దేశాలతో కలిసి పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మంకీపాక్స్ గురించి మరింత సమాచారం సేకరిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయ్. మంకీపాక్స్ వైరస్.. ఆసియా ఖండంలోకి కూడా ఎంటర్ అయింది. ఇజ్రాయెల్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదయింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపించగా.. అతన్ని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 12 దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే వందకు పైగా కేసులు నమోదయ్యాయ్. అనుమానిత కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయ్.
గతంలో మంకీపాక్స్ కేసులు… పశ్చిమ ఆఫ్రికాతో సంబంధాలు ఉన్న వ్యక్తుల్లో మాత్రమే కనిపించాయ్. ఐతే ఇప్పుడు అమెరికా, బ్రిటన్, స్పెయిన్, పోర్చగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియాల్లోనూ ఈ కేసులు గుర్తించారు. ఇది ఇప్పుడు మరింత టెన్షన్ పెడుతోంది. మంకీపాక్స్ అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందిందే ! జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంటుంది. శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది.
.
మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, శరీరంపై దద్దుర్లు, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయ్. ఇవి 2 నుంచి 4 వారాల పాటు ఉంటాయి. మంకీపాక్స్‌లో ప్రధానంగా రెండు స్ట్రెయిన్స్ ఉన్నాయ్. ఒకటి కాంగో స్ట్రెయిన్. ఇది కొంత తీవ్రంగా ఉంటుంది. ఈ స్ట్రెయిన్ సోకితే 10శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. మరో స్ట్రెయిన్ పశ్చిమ ఆఫ్రికా.. దీని మరణాల రేటు కేవలం ఒక శాతం కంటే ఎక్కువ. మాములుగా మధ్య, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలకే పరిమితమైన మంకీపాక్స్.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఐతే బ్రిటన్‌లో నమోదైన తొలి కేసు మూలాలు ఆఫ్రికాలోని నైజీరియాలో ఉన్నాయి. ఐతే ఇప్పుడు యూరప్‌లో నమోదవుతోన్న కేసులకు ఆఫ్రికాతో ఎటువంటి సంబంధం లేకపోవడం.. చాలామందిలో టెన్షన్ పుట్టిస్తోంది.
వైరస్ సోకిన జంతువు కరిచినా ఈ వ్యాధి సోకుతుంది. అలాగే మనుషుల నుంచి మనుషులకు కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. మంకీపాక్స్‌తో బాధపడుతున్న వ్యక్తి రక్తం, చెమటను తాకినా ఈ వ్యాధి సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా… వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం ఈ వైరస్ ఎక్కువగా యువకులకు సోకుతోంది. ఆఫ్రికాతో సంబంధం లేని ఓ యువకుడికి ఈ వైరస్ సోకింది. అతను స్వలింగ సంపర్కుడు అని… ఇది లైంగికంగా ఒకరి నుంచి మరొకరి సోకుతుందన్న అనుమానాలను యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వ్యక్తం చేసింది. స్పెయిన్, పోర్చుగల్‌లోనూ యువకుల్లోనే వ్యాధి కనిపించింది. శృంగారంతోనూ ఈ వ్యాధి సోకుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు పెరుగుతున్నాయ్.
- Monkeypox Cases: 23దేశాల్లో 250మంకీపాక్స్ కేసులు నమోదు
- Monkeypox : మంకీపాక్స్ సోకిన వారు మూడు వారాలు వీటికి దూరంగా ఉండాలి
- Monkeypox Vaccinations: మంకీపాక్స్ వ్యాక్సినేషన్స్‌కు అంత అర్జెంట్ లేదు – WHO
- Monkeypox Virus : విజృంభిస్తున్న మంకీపాక్స్.. 14దేశాల్లో పాకిన వైరస్.. 100కిపైగా కేసులు..!
- Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్
1Maharashtra Political Crisis: అదునుకోసం వేచిచూసి.. మహా ‘సంక్షోభం’లో వ్యూహరచన అతనిదేనా..
2Ap Intermediate Results: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..
3Pelli SandaD: పెళ్లిసందD ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్!
4Russia-Ukraine War: రష్యాపై భారత్ మరింత ఒత్తిడి పెంచాలి: అమెరికా
5Maharashtra Political Crisis: రసవత్తరంగా ‘మహా’ రాజకీయం.. అసెంబ్లీ రద్దు యోచనలో ఉద్ధవ్ ఠాక్రే?
6Vaishnav Tej: రాముడు కాదప్ప.. రుద్ర కాళేశ్వరుడు..!
7congress: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ
8Afghanistan Earthquake: అఫ్ఘానిస్తాన్‌లో భారీ భూకంపం.. 250 మంది మృతి!
9cbi: కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబంపై సీబీఐకు కేఏ పాల్ ఫిర్యాదు
10Film Chamber: సినిమా కార్మికుల సమ్మెపై ఫిలిం ఛాంబర్ సమావేశం
-
Electric Shock : దేవాలయానికి మైకులు కడుతుండగా విషాదం..విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి
-
Corona Cases : తెలంగాణలో కొత్తగా 403 కరోనా కేసులు
-
Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
-
Daggubati Venkateswara Rao : దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు..పరామర్శించిన చంద్రబాబు
-
Varun Tej: మరో యంగ్ డైరెక్టర్‌కు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్..?
-
Ali: పవన్‌తో మళ్లీ కనిపిస్తానంటోన్న ఆలీ!
-
Karanam Dharmashree : వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి టీచర్ ఉద్యోగం
-
Nani: దసరా కోసం కోత.. తప్పదంటున్న నాని..?