H-1B Visa: హెచ్‌-1బీ వీసాలకు పూర్తిస్థాయిలో దరఖాస్తులు అందాయి: అమెరికా

తాము 65 వేల హెచ్‌-1బీ వీసాలకు గాను.. అన్ని నిబంధనల ప్రకారం సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల నుంచి ర్యాండమ్ గా దరఖాస్తులను ఎంపిక చేశామని అమెరికా పేర్కొంది. హెచ్‌-1బీ వీసాలకు అర్హులైన వారికి ఈ విషయాన్ని తెలిపామని చెప్పింది.

H-1B Visa: హెచ్‌-1బీ వీసాలకు పూర్తిస్థాయిలో దరఖాస్తులు అందాయి: అమెరికా

Laid-off H-1B workers

H-1B Visa: హెచ్‌-1బీ వీసాల జారీకి ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2024) పరిమితి మేరకు ఇప్పటికే 65,000 వీసాల జారీకి సరిపడా దరఖాస్తులు వచ్చినట్లు అమెరికా తెలిపింది. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ (USCIS) ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన చేసింది.

తాము 65 వేల హెచ్‌-1బీ వీసాల (H 1B Visa Cap )కు గాను.. అన్ని నిబంధనల ప్రకారం సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల నుంచి ర్యాండమ్ గా దరఖాస్తులను ఎంపిక చేశామని పేర్కొంది. హెచ్‌-1బీ వీసాలకు అర్హులైన వారికి ఈ విషయాన్ని తెలిపామని చెప్పింది. అయితే, 65 వేల హెచ్‌-1బీ వీసాల్లో 6,800 వీసాలను యూఎస్-చిలీ, యూఎస్-సింగపూర్ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం ప్రకారం ఆయా దేశాల వారికి కేటాయిస్తారు.

హెచ్‌-1బీ వీసాలను నాన్-ఇమ్మిగ్రంట్ వర్క్ వీసాలు అంటారు. విదేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న నిష్ణాతులకు వీటిని జారీ చేస్తారు. వేలాది మంది ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు వీటిపైనే ఆధారపడతాయి. భారత్, చైనా నుంచి అధికమంది ఉద్యోగులు హెచ్‌-1బీ వీసాల ద్వారా అమెరికాకు వెళ్తుంటారు.

విదేశీ కంపెనీల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. వాటిని పరిశీలించడం అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ (USCIS)కు ఓ పెద్ద ప్రక్రియగా మారుతుంది. ప్రతి ఏడాది మంజూరు చేసే 65 వేల వీసాలకు దరఖాస్తులు ఇప్పటికే రావడంతో కొత్తగా దరఖాస్తులు చేసుకునే అవకాశం లేదు. ఎన్ని వీసా దరఖాస్తులు వచ్చాయన్న విషయాన్ని అధికారులు తెలపలేదు. పరిమితి 65 వేల వీసాలకు కావాల్సిన దరఖాస్తులు అందాయని మాత్రమే చెప్పింది.

EPFO: ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 8.15 శాతం.. నిర్ణయించిన ఈపీఎఫ్ఓ