EPFO: ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 8.15 శాతం.. నిర్ణయించిన ఈపీఎఫ్ఓ

2022-23కుగాను ఉద్యోగులకు పీఎఫ్‌పై 8.15 శాతం వడ్డీ వర్తిస్తుంది. గత ఏడాదికంటే ఈ సారి అధిక వడ్డీని నిర్ణయించింది. 2021-22కిగాను ఈపీఎఫ్ఓ 8.10 శాతం మాత్రమే వడ్డీ అందించింది. దీన్ని ఈ ఏడాది స్వల్పంగా పెంచి 8.15 శాతం వడ్డీగా నిర్ణయించింది ఈపీఎఫ్ఓ. మంగళవారం జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ వడ్డీరేటుపై నిర్ణయం తీసుకున్నారు.

EPFO: ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 8.15 శాతం.. నిర్ణయించిన ఈపీఎఫ్ఓ

EPFO: ప్రావిడెంట్ ఫండ్‌ (పీఎఫ్)పై 8.15 శాతం వడ్డీ రేటు నిర్ణయిస్తూ ఈపీఎఫ్ఓ (ద ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిర్ణయం తీసుకుంది. 2022-23కుగాను ఉద్యోగులకు పీఎఫ్‌పై 8.15 శాతం వడ్డీ వర్తిస్తుంది. గత ఏడాదికంటే ఈ సారి అధిక వడ్డీని నిర్ణయించింది. 2021-22కిగాను ఈపీఎఫ్ఓ 8.10 శాతం మాత్రమే వడ్డీ అందించింది.

Data Theft Case: డేటా చోరీ కేసులో నమ్మలేని నిజాలు.. జస్ట్ డయల్‌కు నోటీసులిచ్చేందుకు సిద్ధమైన పోలీసులు

దశాబ్దంలోనే ఇది తక్కువ వడ్డీ రేటు. అలాగే 1977-78లో అందించిన 8 శాతం వడ్డీ తర్వాత కూడా ఇదే తక్కువ వడ్డీ రేటు. దీన్ని ఈ ఏడాది స్వల్పంగా పెంచి 8.15 శాతం వడ్డీగా నిర్ణయించింది ఈపీఎఫ్ఓ. మంగళవారం జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ వడ్డీరేటుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను ముందుగా కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత దీనిపై ఈపీఎఫ్ఓ నోటిపికేషన్ విడుదల చేస్తుంది. త్వరలోనే ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుంది. 1952 నాటి యాక్ట్ ప్రకారం ఈపీఎఫ్ఓ అమలవుతుంది.

దీని ప్రకారం… కంపెనీలు ఉద్యోగుల బేసిక్ శాలరీ నుంచి 12 శాతం తప్పనిసరిగా పీఎఫ్‌కు కేటాయించాలి. అలాగే ఉద్యోగి కూడా మరో 12 శాతం కేటాయించాలి. మార్చి 27, 28 తేదీల్లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ సమావేశం జరిగింది. దీనిలో ఈపీఎఫ్ఓకు సంబంధించిన వార్షిక లెక్కల్ని పరిశీలించి, వడ్డీపై నిర్ణయం తీసుకుంటారు.