నేను డజను మాస్కులు ఆర్డర్ చేస్తే..12మాత్రమే పంపించారు..మిగతావి కూడా పంపించండీ : కస్టమర్ రిక్వెస్ట్..షాక్ అయిన స్టోర్ ఓనర్

నేను డజను మాస్కులు ఆర్డర్ చేస్తే..12మాత్రమే పంపించారు..మిగతావి కూడా పంపించండీ : కస్టమర్ రిక్వెస్ట్..షాక్ అయిన స్టోర్ ఓనర్

Usa Angry Customer Demands A Dozen Masks, Receiving Only 12

Angry Customer Demands A Dozen Masks, Receiving “Only 12” : ఓ అమెరికన్ వ్యక్తి తెలివి గురించి తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఆ తెలివితేటల వైనమేమనగా..‘‘నేను డ‌జ‌ను మాస్కులు ఆర్డ‌ర్ చేసాను..కానీ మీరు నాకు ప‌న్నెండు మాస్కులు మాత్రమే పంపించారు. నా డ‌బ్బులు నాకు వాప‌సు ఇవ్వండి..లేదంటే మిగతా మాస్కులు అయినా పంపించండీ’’అంటూ ఓ అమెరిక్ ఆర్డర్ చేసిన స్టోర్ ఓనర్ కు మెయిల్ పంపించాడు. ఇప్పుడు అర్థం అయిందా? సదరు అమెరిక్ తెలివి ఎంత అమోఘమైందో..ఏంటీ మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా? అదేంలేదండీ..సదరు కస్టమర్ 12 (డజను) మాస్కులు ఆర్డర్ చేశాడు. స్టోర్ వాళ్లు కూడా 12 పంపించారు. కానీ పాపం కష్టమర్ కేమో డజన్ అంటే 12 అని తెలీదు..దీంతో స్టోర్ వాళ్లు తనను మోసం చేసేసారేమోననుకుని ఆగమాగం అయిపోయాడు.

దీంతో స్టోర్ యాజమాన్యానికి ఓ మెయిల్ పెట్టాడు. నేడు డజను ఆర్డరిస్తే మీరు 12 పంపించారు నా మిగిలిన డబ్బులు వాపసు పింపించండీ అంటూ..ఇది విన్నాకు నవ్వకుండా ఉండగలరా? సదరు అమెరికన్ తెలివికి షాక్ అవ్వకుండా ఉండగలరా?!! ఏంటీ అమెరికన్ తెలివితేటలు మామూలుగా లేవు కదూ..

ఈ మెయిల్ లో ‘‘ఇంకా మీరు ఇలా చేస్తే..ఇక నుంచి మీ బిజినెస్‌కు నేను స‌పోర్ట్ ఇవ్వ‌ను. బ్లాక్ వాళ్లు (నల్లజాతీయులు) న‌డిపే స్టోర్ల‌కు నేను స‌పోర్ట్ ఇద్దామ‌ని అనుకున్నాను… మీరు మాత్రం ప్ర‌జ‌ల‌ను ఇలా దోచుకుంటూనే ఉన్నారు’’ అన్న‌ది ఆ మెయిల్ సారాంశం. ఆ మెయిల్ చూసిన ఆ స్టోర్ ఓన‌ర్‌కు దిమ్మ‌తిరిగిపోయింది. మళ్లీ మరోసారి చదివింది మిన్నెసొటాలోని చిన్న స్టోర్‌కు ఓన‌ర్‌గా ఉన్న జాడా మెక్‌క్రే. తాను పొరపాటు పడలేదని నిర్ధారించుకుంది. అనంతరం క్లారిటీగా తిరిగి మెయిల్ పంపించింది జాడా మెక్ క్రే. ఏమనంటే..‘‘డ‌జ‌ను అంటే ప‌న్నెండే క‌దా… మీకు రీఫండ్ ఇవ్వ‌డం కుద‌ర‌దు’’ అని.

బిల్లులో కూడా చాలా స్ప‌ష్టంగా ఉంది. 12 మాస్క్‌ల‌కు డ‌బ్బులు తీసుకున్నాము క‌దా అని కూడా ఆమె గుర్తు చేసింది. అది చూసిన క‌స్ట‌మ‌ర్‌.. అవునా, నిజానికి నాకు 20 కావాలి. నేను బిల్లు స‌రిగా చూడ‌లేద‌నుకుంటా. నేను డ‌బ్ జ‌న్ అనే 20ఏళ్ల యువకుడు రిప్లై ఇచ్చాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ట్విట‌ర్‌లో వైర‌ల్ అయ్యింది. ఈ ఒక్క సందర్భంతో మెక్‌క్రే చిన్నపాటి స్టోర్‌కు డిమాండ్ పెరిగిపోయింది.

గ‌తంలో అప్పుడోఇప్పుడో ఆర్డ‌ర్లు వచ్చే ఆమె స్టోర్ కు ఇప్పుడు ఆర్డర్్లమీద ఆర్డర్లు వస్తున్నాయని చెప్పింది. రోజుకు 30 ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయ‌ని జాడా మెక్‌క్రే తెలిపింది. చూశారా? ఒక్కో సందర్భం ఒక్కో మార్పుకు కారణమవుతుంటుంది. అలా జాడా మెక్ క్రేకు ఈ అతి తెలివి కష్టమర్ ఘటన మేలే చేసింది. కాగా ఈ మాస్కుల సారాంశం ఘటనకు సంబంధించి ట్విట్టర్‌లో 3 లక్షలకు పైగా ‘లైక్‌లు’ వచ్చాయి. వందలాది కామెంట్స్ వచ్చి వైరల్ గా మారింది.