Navy Chief: హిందూ మహాసముద్రంలో చైనా చర్యలను నిశితంగా గమనిస్తున్నాం: భారత నౌకాదళం

భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరి కుమార్ స్పందిస్తూ... ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు చెందిన అనేక ఓడలు తిరుగుతుంటాయి. 4-6 చైనా నౌకాదళ, పరిశోధక నౌకలు కూడా తిరుగున్నట్లు తెలిసింది. చైనా చేపల నౌకలు కూడా బాగా ఉంటాయి. హిందూ మహాసముద్రంలోని ఆయా అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నాం’’ అని అన్నారు. తనను తాను రక్షించుకోవడానికి భారత్ ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేదని చెప్పారు.

Navy Chief: హిందూ మహాసముద్రంలో చైనా చర్యలను నిశితంగా గమనిస్తున్నాం: భారత నౌకాదళం

Navy Chief

Navy Chief: హిందూ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరి కుమార్ అన్నారు. ఆ ప్రాంతంలో చైనా నౌకలు తిరుగుతూ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అనధికారికంగా చేపలవేట ఓడలు పెద్ద ఎత్తున సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, గూఢచర్య నౌకలనూ పంపుతూ చైనా దుందుడకు చర్యలకు పాల్పడుతోంది.

ఈ నేపథ్యంలో ఇవాళ దీనిపై ఆర్.హరి కుమార్ స్పందిస్తూ… ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు చెందిన అనేక ఓడలు తిరుగుతుంటాయి. 4-6 చైనా నౌకాదళ, పరిశోధక నౌకలు కూడా తిరుగున్నట్లు తెలిసింది. చైనా చేపల నౌకలు కూడా బాగా ఉంటాయి. హిందూ మహాసముద్రంలోని ఆయా అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నాం’’ అని అన్నారు.

హిందూ మహాసముద్రం చాలా కీలకమైన ప్రాంతమని, పెద్ద ఎత్తున దాని మీదుగా వాణిజ్యం, రవాణా వంటి కార్యకలాపాలు జరుగుతుంటాయని గుర్తు చేశారు. హిందూ మహాసముద్రానికి సంబంధించి భారత ప్రయోజనాలను కాపాడుకోవడమే తమ విధని చెప్పారు. ఆ విషయంలో నౌకాదళం సిద్ధంగా ఉందని అన్నారు. తనను తాను రక్షించుకోవడానికి భారత్ ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేదని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ ఉక్రెయిన్ కు పలు దేశాలు సాయం చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..