Snail slime soap : నత్తల జిగటతో సబ్బులు తయారీ..వాడితే ముసలితనం రాదట..చర్మ వ్యాధులకూ చెక్ పెట్టేయొచ్చట..!!

నత్తలు స్రవించే జిగటతో సైంటిస్టులు సబ్బులు తయారు చేస్తున్నారు. ఆ సబ్బులు వాడితే ముసలితనం రాదనీ..చర్మవ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. చర్మవ్యాధి సమస్యలకు ఈ నత్తల జిగటతో తయారు చేసిన సబ్బుతో చెక్ పెట్టేయవచ్చని అంటున్నారు. గతేడాది ఫ్రాన్స్‌లో 60,000 నత్తల నుంచి బురదను సేకరించారు. వాటితో సబ్బులు తయారుచేశారు. ఈ సబ్బులకు మంచి డిమాండ్ ఉండటంతో నత్తల జిగటతో సబ్బుల తయారీ ఊపందుకుంది.

Snail slime soap : నత్తల జిగటతో సబ్బులు తయారీ..వాడితే ముసలితనం రాదట..చర్మ వ్యాధులకూ చెక్ పెట్టేయొచ్చట..!!

Making Soaps With Snail Slime

Making soaps with snail slime: నత్తలు అనగానే మనకు నత్త నడక అనే మాట ఠక్కున గుర్తుకొస్తుంది. నెమ్మదిగా నడిచేవారిని అలా అంటారు. ఇదిలా ఉంటే నత్తలకు ఓ ప్రత్యేక గుణం ఉంది. వాటికి ఉండే చిప్ప లేదా పెంకుకి దెబ్బతగిలితే వాటిని అవే బాగుచేసుకుంటాయి. అలాగే… వాటి ఆరోగ్యానికీ, శరీరానికి ఏదైనా సమస్య వస్తే.. వాటంతట అవి బాగు చేసేసుకుంటాయని సైంటిస్టులు పరిశోధనల్లో తేలింది.అవి అలా ఎలా చేసుకుంటాయని మరో అనుమానం వచ్చింది సైంటిస్టులకు. అనుమానం వస్తే దాన్ని క్లియర్ చేసుకునేవరకూ వాళ్లకు నిద్ర పట్టదుగా..పరిశోధనలు చేయగా..అవి అలా సెట్ చేసేసుకోవటానికి కారణం నత్తలు స్రవించే ‘జిగట’ లేదా బురద అని తేలింది. అంటే ఆ జిగట చాలా ఆరోగ్యాన్నిచ్చేదని తేలిపోయింది. ఆ జిగట పదార్థం వల్లే నత్తలు ఇలా చేయగలుగుతున్నాయని అర్థమైంది. దాంతో… ఆ పదార్థాన్ని సేకరించడం మొదలుపెట్టేశారు.

1

అలా ఆ నత్తలను..అవి స్రవించే జిగటను సేకరించి వాటితో సబ్బులు తయారు చేశారు. గతేడాది ఫ్రాన్స్‌లో 60,000 నత్తల నుంచి బురదను సేకరించారు. వాటితో సబ్బులు తయారుచేశారు. ఆ సబ్బులు అమ్మారు కూడా. ఆ నత్త జిగట సమస్యలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. చాలా మంది వాటిని కొంటున్నారు.

8

నత్త జిగటతో తయారు చేసిన సబ్బులు వాడితే వృద్ధాప్య ఛాయలు రావని..(రావు అంటే అస్సుల రావని కాదు..త్వరగా రావు అని) అలాగే ఈ సబ్బులు వాడితే చర్మానికి వచ్చే రకరకాల వ్యాధుల్ని పోగొట్టే శక్తి ఉందని అంటున్నారు సైంటిస్టులు. 2020లో నత్తల జిగట సబ్బులు చక్కగా అమ్ముడైపోవటంతో ఈ సంవత్సరం కూడా ఆ జిగటతో సబ్బుల తయారీ జోరుగా సాగుతోంది.

3

ఎంత జిగట సేకరిస్తే ఓ సబ్బు తయారవుతుందనే డౌట్ వస్తుంది కదూ..ఎందుకంటే నత్త చిన్నగా ఉంటుంది.ఇక అది స్రవించే జిగట ఇంకా తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి. నిజమే..అలా 40 నత్తల నుంచి సేకరించిన జిగటతో ఓ సబ్బు తయారవుతుందని తెలిపారు. ఈజిగటదలో… కొల్లాజెన్. ఎలాస్టిన్ అనేవి ఉన్నాయనీ..ఇవి గాయాలను నయం చేయగలవనీ… చర్మ కణాలను రిపేర్ చేసి… వృద్ధాప్యం రాకుండా ఆపగలవు అని పరిశోధకులు తెలిపారు. చర్మానికి వచ్చే రకరకాల వ్యాధుల్ని పోగొట్టే శక్తి… ఈ సబ్బులకు ఉంటుందని తెలిపారు.

77

ఫ్రాన్స్‌లో డామిన్ డెస్రోచెర్ 60 వేల నత్తలను పెంచుతున్నారు. నత్తల జిగురుతో కాస్మెటిక్ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నత్తలపై పెద్దగా పరిశోధనలు జరగట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని..డామిన్ పరిశోధనలు చేయడంతో… ఈ సరికొత్త విషయం ఆయనకు తెలిసింది.

30

దాంతో జిగురు పదర్థం సేకరించి సబ్బులు తయారుచేసి విక్రయిస్తున్నారు. ఫీడ్ బ్యాక్ తెలుసుకుని పలు రకాల కాస్మెటిక్ ఉత్పత్తుల్ని తయారు చేసి అమ్ముతున్నారు.వీటికి చక్కటి డిమాండ్ ఉంటుందోని తెలిపారు.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాస్మెటిక్ కంపెనీలు కూడా ఈ నత్తల జిగురుపై ఫోకస్ పెడుతున్నాయి.

6