Coronavirus : వైర‌స్ లీక్‌పై డ‌బ్ల్యూహెచ్‌వో 2వ‌సారి ద‌ర్యాప్తు.. ఖండించిన చైనా

కరోనా వైరల్ చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ లో నుంచి వచ్చిందని ఆరోపణలు ఉన్న విషయం విదితమే. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై గతంలో దర్యాప్తు చేపట్టింది.. కానీ ల్యాబ్ వివరాలు ఇచ్చేందుకు చైనా అంగీకరించలేదు.  మరోసారి దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్దమవుతున్న తరుణంలో చైనా బాంబు పేల్చింది.

Coronavirus : వైర‌స్ లీక్‌పై డ‌బ్ల్యూహెచ్‌వో 2వ‌సారి ద‌ర్యాప్తు.. ఖండించిన చైనా

Coronavirus (2)

Coronavirus : కరోనా వైరల్ చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ లో నుంచి వచ్చిందని ఆరోపణలు ఉన్న విషయం విదితమే. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై గతంలో దర్యాప్తు చేపట్టింది.. కానీ ల్యాబ్ వివరాలు ఇచ్చేందుకు చైనా అంగీకరించలేదు.  మరోసారి దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్దమవుతున్న తరుణంలో చైనా బాంబు పేల్చింది.

తాము ఈ దర్యాప్తును అడ్డుకొంటామని వెల్లడించింది. రెండవసారి విచారణ చేపట్టే ప్రణాలికను తోసిపుచ్చింది చైనా.. అయితే రెండవ సారి దర్యాప్తులో చైనాలోని వైరాలజీ ల్యాబ్ లను అడిట్ చేయడంతోపాటు అక్కడ ఉన్న జంతు మార్కెట్లను పరిశీలించాలనుకుంది. అయితే చైనా మాత్రం దర్యాప్తుకు సహకరించేది లేదని తేల్చి చెప్పింది.

వైరస్ పుట్టక, ఆనవాళ్లు కనుగొనే దర్యాప్తుకు తాము అంగీకరించడం లేదని చైనా నేషన్ హెల్త్ కమిషన్ మంత్రి జెంగ్ యిక్సిన్ తెలిపారు. ఇది సామాజిక సృహకు విరుద్ధమని, సైన్సు దిక్కరించినట్లే అవుతుందని అన్నారు. చైనా ల్యాబుల్లో ప్రొటోకాల్స్ ఉల్లంఘన జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నాడు యిక్సిన్. వైరస్ పుట్టుకను శాస్త్రీయ అంశంగా పరిగణించాలని జెంగ్ తెలిపారు.

వైరస్ పుట్టుకపై కేవలం చైనాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అధ్యయనం చేయాలనీ చైనా ఆరోగ్యశాఖ మంత్రి జెంగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సూచించారు. కరోనా వైరస్ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచుతుంది చైనా. చైనాలోనే వుహాన్ నగరంలోనే కరోనా పుట్టిందని ప్రపంచ దేశాలు చెబుతున్న… దర్యాప్తు మాత్రం చైనా సహకరించడం లేదు. గతంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధులు వెళ్లిన సమయంలో కూడా వారిని వుహాన్ సిటీలోకి అనుమతించలేదని ఆరోపణలు ఉన్నాయి.

ఇక రెండవసారి దర్యాప్తుకు తాము సహకరించమని చైనా ఖరాకండిగా చెబుతుంది.