kim jong un: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పరిపాలించేది ఈమెనే: దక్షిణ కొరియా

దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇటువంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి. గతంలో..

kim jong un: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పరిపాలించేది ఈమెనే: దక్షిణ కొరియా

kim jong un

కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఉత్తర కొరియాను ఎవరు పరిపాలిస్తారన్న విషయంపై దక్షిణ కొరియా నిఘా ఏజెన్సీ తాజాగా పలు వివరాలు తెలిపింది. కిమ్ వారసురాలిపై దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇటువంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి. 2022 నుంచి కిమ్ జోంగ్ ఉన్ తన రెండో కూతురు జు ఏను దేశానికి చెందిన ముఖ్యమైన కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారు.

జు ఏ వయసు 10 సంవత్సరాలు మాత్రమే. ఆమెనే ఉత్తరకొరియా తదుపరి అధ్యక్షురాలిగా చేసే ఆలోచనలో కిమ్ జోంగ్ ఉన్నట్లు దక్షిణ కొరియా అంచనాలు వేసింది. అలాగే, కిమ్ జోంగ్ ఉన్ వయసు 41 ఏళ్లు మాత్రమే. ఆయన వయసు తక్కువే ఉండడం, తీవ్ర అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోవడంతో ఇప్పట్లో జు ఏను అధ్యక్షులిగా ప్రకటించే అవకాశాలు లేవని కూడా దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ భావిస్తోంది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 2022 నుంచి పలుసార్లు మిలటరీ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రపంచానికి రెండు సందేశాలు ఇచ్చారు. అందులో ఒకటి.. ఉత్తర కొరియాని మరో తరం పాటు కూడా కిమ్ కుటుంబమే పాలిస్తుంది. రెండోది… తమకు ఎవరూ సవాళ్లు విసరకుండా ఉండేందుకు తమ వద్ద అణ్వాయుధ సంపత్తి ఉందని చాటి చెప్పడం.

తన రెండో కూతురిని మరోసారి ప్రపంచానికి చూపుతూ తన మొదటి సందేశాన్ని ఇచ్చారు కిమ్. అణ్వాయుధ సంపత్తిని ఆమెతో కలిసి పరిశీలించి రెండో సందేశాన్ని పరోక్షంగా చెప్పారు. కిమ్ రెండో కూతురు జు ఏకి దాదాపు తొమ్మిదేళ్లు ఉంటాయి. ఆమెను దక్షిణ కొరియా అధ్యక్షురాలిగా కిమ్ ప్రకటించే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆయన తన కూతురు భవిష్యత్తులో ఉత్తరకొరియా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందన్న సందేహాలు రావచ్చు.

ఇలా చేయడం కొత్తేం కాదు..

కిమ్ కుటుంబానికి మాత్రం ఇలా చేయడం కొత్తేం కాదు. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ Il కూడా గతంలో ఇలాగే చేశారు. కిమ్ ను 8 ఏళ్ల వయసులోనే ఉత్తరకొరియాకు కాబోయే అధ్యక్షుడిగా తమ అనుచరులకు కిమ్ జోంగ్ Il  పరిచయం చేశారని ఓ విశ్లేషకుడు తెలిపారు. 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయనను తన వారసుడిగా కిమ్ జోంగ్ Il ప్రకటించిన విషయం అప్పట్లో ప్రపంచానికి తెలియదు. కేవలం కిమ్ జోంగ్ Il అనుచరులకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కిమ్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

కిమ్ కు  అందుకే తన కూతురిని జు ఏను 10 ఏళ్ల వయసులోనే ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ విషయంపై వస్తున్న ఊహాగాలనాలకు బలపర్చేలా కిమ్ తన కూతురితో కలిసి పలు కార్యక్రమాల్లో వరుసగా పాల్గొంటున్నారు. కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవం సందర్భంగా జు ఏను కిమ్ మిలటరీ అధికారులకు మరోసారి పరిచయం చేశారు. ఆమె కలిసి కిమ్ జోంగ్ ఉన్ ఖండాంతర క్షిపణి ప్రయోగాలను కూడా వీక్షించారు.

విలాసవంతమైన జీవితం గడుపుతున్న పాప

జు ఏ అంటే కిమ్ కు అమితమైన ప్రేమ. ఆమె వాన్సన్ లోని సముద్రం పక్కన ఓ విల్లాలో విలాసమైన జీవితాన్ని గడుపుతోంది. అతి అతి పెద్ద విల్లా. స్విమ్మింగ్ పూల్స్ తో పాటు టెన్నిస్ కోర్టులు, సాకర్ గ్రౌండ్, స్పోర్ట్స్ స్టేడియం కూడా ఉంటాయి. కిమ్ కుటుంబానికి దాదాపు15 విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. జు ఏను ఆమె సంరక్షకులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తాజాగా, కూతురు, భార్యతో కలిసి మిలటరీ శిబిరాల వద్దకు కిమ్ వెళ్లిన అంశంపై సియోల్ లోని ఈవ్హా వర్సిటీ ప్రొఫెసర్ లీఫ్-ఎరిక్ ఈస్లీ స్పందించారు.

ఉత్తరకొరియాలో తన కుటుంబ రాచరికం కొనసాగుతుందని, అలాగే తమ దేశ మిలటరీ విధానంలో మార్పులు ఏవీ ఉండబోవని ప్రపంచానికి కిమ్ చాటి చెప్పారని అన్నారు. కిమ్ కి ముగ్గురు కూతుళ్లని వారిలో రెండో పాపే జు ఏ అని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.

ఉత్తరకొరియాకు కిమ్ జోంగ్ ఉన్ 2012 ఏప్రిల్ 11 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతకు ముందు కిమ్ తండ్రి కిమ్ జోంగ్ Il ఆ పదవిలో ఉండేవారు. కిమ్ జోంగ్ Ilకు ముందు కిమ్ Il సంగ్ ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు. కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని కూడా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన తర్వాత కూడా దేశాన్ని తన కుటుంబమే పాలిస్తుందని, విదేశీ శక్తులకు భయపడబోమని పరోక్షంగా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు కిమ్.

Terrifying Video: తీర్పు చదువుతోన్న మహిళా జడ్జిపైకి ఎగిరి.. దాడి చేసిన నిందితుడు