USA: పిల్ల‌లు క‌ల‌గ‌డం లేద‌ని డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లిన మ‌హిళ‌.. 34 ఏళ్ల‌కు బ‌య‌ట ప‌డిన మోసం

కుమార్తె బ్రియానా హేస్ వయస్సు ప్రస్తుతం 33 సంవత్సరాలు. డీఎన్ఏ పరీక్ష, వంశవృక్ష వెబ్‌సైట్ అయిన 23అండ్ మీకి తన డీఎన్ఏని సమర్పించిన తర్వాత ఆమె ఇటీవల తన జీవసంబంధమైన తండ్రి గుర్తింపును కనుగొంది.

USA: పిల్ల‌లు క‌ల‌గ‌డం లేద‌ని డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లిన మ‌హిళ‌.. 34 ఏళ్ల‌కు బ‌య‌ట ప‌డిన మోసం

USA: అమెరికాలో ఓ విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ మహిళ తనకు 34 ఏళ్ల క్రితం కృత్రిమ గర్భధారణ చేసిన వైద్యుడిపై కేసు పెట్టింది. గర్భధారణ ప్రక్రియ కోసం డాక్టర్ తన సొంత స్పెర్మ్‌ను మోసపూరితంగా ఉపయోగించారని ఆ మహిళ ఆరోపించింది. ప్రస్తుతం ఆ మహిళ వయసు 67 ఏళ్లు. ఈ వ్యవహారం అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు సంబంధించినది.

అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలోని హౌసర్‌కు చెందిన షారన్ హేస్‌కు ప్రస్తుతం 67 సంవత్సరాలు. ఆమె 1989లో వాషింగ్టన్‌లోని స్పోకేన్‌లో ఉన్న ప్రసూతి వైద్యుడు, స్త్రీ జననేంద్రియ నిపుణుడు డాక్టార్ డేవిడ్ R. క్లేపూల్ వద్ద సంతానోత్పత్తి చికిత్స చేయించుకున్నట్లు పేర్కొంది. కారణం, ఆమె భర్త గర్భం దాల్చడంలో ఇబ్బంది ఎదుర్కోవడం. అయితే తనకు సంతానదానం చేసిన వివరాలు రహస్యంగా ఉంచాలని, అది తనకు తెలియని వ్యక్తుల నుంచి తీసుకోవాలని ఆమె ముందుగానే షరతు పెట్టింది. కానీ సదరు డాక్టర్.. ఏకంగా తన స్పెర్మ్ నే ఉపయోగించాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: ఇజ్రాయెల్-హమాస్ పై ఓటింగులో ఇండియా వైఖరిపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు

బుధవారం నాడు స్పోకేన్ కౌంటీ సుపీరియర్ కోర్ట్‌లో డాక్టర్ డేవిడ్‌పై షారన్ దావా వేసింది. అనామక దాతగా ఉండాలనేది తన అభిమతమని షారన్ తన ఫిర్యాదులో రాసింది. కానీ డాక్టర్ డేవిడ్ క్లేపూల్ తప్పుడు సమాచారాన్ని అందించాడట. జుట్టు, కంటి రంగు వంటి లక్షణాల ఆధారంగా దాత ఎంపిక చేయబడతారని వారికి హామీ ఇచ్చాడట. ఎంపికైన దాతకు ఆరోగ్య, జన్యుపరమైన పరీక్షలు నిర్వహిస్తామని కూడా చెప్పాడట. ఇందుకోసం వారి వద్ద నుంచి $100 నగదు తీసుకున్నాడు. ఈ డబ్బు కాలేజ్ లేదా మెడికల్ స్టూడెంట్స్ స్పెర్మ్ డొనేట్ చేయడానికి అని చెప్పాడు.

కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన షారన్ కుమార్తె బ్రియానా హేస్ వయస్సు ప్రస్తుతం 33 సంవత్సరాలు. డీఎన్ఏ పరీక్ష, వంశవృక్ష వెబ్‌సైట్ అయిన 23అండ్ మీకి తన డీఎన్ఏని సమర్పించిన తర్వాత ఆమె ఇటీవల తన జీవసంబంధమైన తండ్రి గుర్తింపును కనుగొంది. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన మరో విషయం వెల్లడైంది. బ్రియానా హేస్ కి తన చుట్టూ కనీసం 16 మంది తోబుట్టువులు ఉన్నారు. ఇలాంటి ఇలాంటి మోసమే ఆ డాక్టర్ చాలా మంది విషయంలో చేశాడని వెల్లడవుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ డాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మరెవ్వరూ ముందుకు రాకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Italy: కొడుకుల్ని ఇంటి నుంచి వెళ్లగొట్టాలంటూ కోర్టుకెక్కిన తల్లి.. కన్నతల్లి ఇంతదాకా రావడానికి కారణమేంటంటే?

ఇది ఖచ్చితంగా గుర్తింపు సంక్షోభం అని బ్రియానా హేస్ అన్నారు. ఈ విషయం తన జీవితాంతం దాచి ఉందని, తాన తల్లి గాయాన్ని తాను అనుభవించినట్లు చెప్పుకొచ్చింది. అదే సమయంలో తన వద్ద వైద్యం చేయించుకున్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, కానీ 40 ఏళ్లలో తాను మొదటిసారి ఇలాంటి విన్నానని డాక్టర్ డేవిడ్ అన్నారు.