lip filler surgery : ఏదో కార్టూన్ పాత్ర అనుకునేరు.. లిప్ ఫిల్లింగ్ సర్జరీ ఫెయిలై ఇలా భయంకరంగా..

ఇటీవల కాలంలో అందంగా కనపడాలనే తాపత్రయం ఎక్కువైపోయింది. అందుకోసం రకరకాల చికిత్సలు చేయించుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లేదంటే ఉన్న అందాన్ని చెడగొట్టుకుని తీరిగ్గా బాధపడుతున్నారు.

lip filler surgery : ఏదో కార్టూన్ పాత్ర అనుకునేరు.. లిప్ ఫిల్లింగ్ సర్జరీ ఫెయిలై ఇలా భయంకరంగా..

lip filler surgery

lip filler surgery : అందానికి మెరుగులు దిద్దుకోవడానికి అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే అందులో కొన్ని వికటించి ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా ఓ మహిళ చేయించుకున్న లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ ఎంతటి అనర్ధానికి దారి తీసిందో తెలిస్తే.. కాదు కాదు చూస్తే అర్ధం అవుతుంది.

KTR : మంత్రి కేటీఆర్ స్వీట్ మెమరీస్.. చిన్ననాటి ఫోటో వైరల్

భగవంతుడు ఇచ్చిన అందంతో పాటు మరింత అందంగా కనపడాలని చాలామంది తహతహలాడతారు. అందుకోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా రకరకాల కాస్మెటిక్ (cosmetic) చికిత్సలు చేయించుకుంటున్నారు. ఇటీవల కాలంలో లిప్ ఫిల్లర్లకు (lip filler) సంబంధించిన చికిత్స పట్ల మహిళలు ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ చికిత్స ద్వారా తమ పెదవులు మరింత అందంగా కనిపించాలని వారు కోరుకుంటున్నారు. కానీ ఈ చికిత్స సమయంలో వాడే ఇంజెక్షన్లు పడకపోతే మనిషి కోలుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చట.. లేదంటే మనిషి రూపమే మారిపోవచ్చట.. లాస్ ఏంజల్స్‌కి (Los Angeles)చెందిన 27 ఏళ్ల జెస్సికా బర్కో (Jessica Burko) విషయంలో అదే జరిగింది. ఉచితంగా లిప్ ఫిల్లింగ్ చికిత్స అనగానే క్లినిక్‌కి పరుగులు పెట్టుకుంటూ వెళ్లింది జెస్సికా. చికిత్స తరువాత ఏదో బహుమతి ఇస్తారంటే కూడా ఆశపడింది. కానీ చికిత్స తరువాత ఆమె తనను తాను చూసుకుని ఒక్కసారిగా షాకైంది. పెదవులు భయంకరంగా వాచిపోయి ఒక కార్టూన్ పాత్రలా ఆమె ఆకారం మారిపోయింది. ఇక తనకు ఈ చికిత్స ఎలాంటి అనర్ధాన్ని తెచ్చిపెట్టిందో సోషల్ మీడియాలో వివరించింది జెస్సికా.

dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్

తాను ఎదుర్కున్న సమస్య నుంచి బయటపడటం కోసం మరలా చికిత్స తీసుకుంది జెస్సికా. ఈ క్రమంలోనే తాను ఎదుర్కున్న సమస్యను వివరిస్తూ వీడియో చేసింది.  ఏదైనా ఉచిత చికిత్స అనగానే వెనకా ముందు ఆలోచించాలని కూడా సూచించింది. అందుకు తన అనుభవమే ఉదాహరణగా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా కాస్మెటిక్ చికిత్సలు.. మరీ ముఖ్యంగా ఉచితంగా అనగానే చేయించుకోవాలి అనుకునేవారు జెస్సికా అనుభవం చూసాకైనా కాస్త ఆలోచించాలి.