HIV with Covid-19: కరోనాతో పాటు 216 రోజులుగా హెచ్ఐవీ.. శరీరం నుంచి 32మ్యూటేషన్ వేరియంట్లు

HIV with Covid-19: కరోనాతో పాటు 216 రోజులుగా హెచ్ఐవీ.. శరీరం నుంచి 32మ్యూటేషన్ వేరియంట్లు

Woman With Hiv Got Covid 19 Infection For 216 Days Develops 32 Virus Mutations

HIV with Covid-19: రీసెర్చర్లు ఆ మహిళ శరీరంలో ఉన్న కరోనా వైరస్ మ్యూటేషన్స్ చూసి కంగుతిన్నారు. దక్షిణాఫ్రికాలోని మహిళకు 216రోజులుగా హెచ్ఐవీతో పాటు కొవిడ్-19 వైరస్ తో బాధపడుతుంది. అంతర్గతంగా బాధపడుతున్న మహిళ శరీరంలో 30కు మ్యూటేషన్లు డెవలప్ అయ్యాయి.

ఈ కేసు రిపోర్టును medical journal medRxiv పేపర్ లో గురువారం పబ్లిష్ అయింది. రిపోర్టు ప్రకారం.. మహిళకు 2006లో హెచ్ఐవీ సోకింది. క్రమంగా ఆమె ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనపడుతూ వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2020లో కొవిడ్-19 ఇన్ఫెక్షన్ కు గురైంది. స్పైక్ ప్రొటీన్ పై వైరస్ ప్రభావం పడి 13మ్యూటేషన్స్ గా, 19 జెనెటిక్ షిఫ్ట్స్ గా ప్రవర్తన మార్చుకుంది.

ఆ మ్యుటేషన్స్ లో కొన్ని E484K మ్యూటేషన్, ఆల్ఫా వేరియంట్ B.1.1.7 మ్యూటేషన్, N510Y మ్యూటేషన్, బీటా వేరియంట్ B.1.351లు.

రీసెర్చర్ల కథనం ప్రకారం.. మహిళ నుంచి మ్యుటేషన్స్ ఇతరులకు సోకినట్లు స్పష్టం కాలేదు. రీసెర్చర్లు దీనిని పూర్తిగా యాదృచ్ఛికం అని చెప్పడం లేదు. దక్షిణాఫ్రికాలో నలుగురు హెచ్ఐవీ పాజిటివ్ లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉంటుందని చెప్పారు.

హెచ్ఐవీ ఇన్ఫెక్టెడ్ వ్యక్తులు కొవిడ్-19 వ్యాప్తి విషయంలో చాలా ప్రమాదకరం. వారిలో చాలా వైద్యపరమైన సమస్యలు తలెత్తడంతో పాటు కొవిడ్ సోకితే మ్యూటేషన్స్ మారిపోయే ప్రమాదకరం అని తెలిసింది. ఇందులో ఇండియా సమస్య ఏంటంటే.. దాదాపు మిలియన్ మంది హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ కు ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు.