World Cup 2023: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ తేదీ మారే అవకాశం…బీసీసీఐ పున: పరిశీలన

వరల్డ్ కప్ 2023 పోటీల్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియంలో అక్టోబరు 15వతేదీన జరగనున్న మ్యాచ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా గేమ్ తేదీని మార్చనున్నారు....

World Cup 2023: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ తేదీ మారే అవకాశం…బీసీసీఐ పున: పరిశీలన

India vs Pakistan match

India vs Pakistan match : వరల్డ్ కప్ 2023 పోటీల్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియంలో అక్టోబరు 15వతేదీన జరగనున్న మ్యాచ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా గేమ్ తేదీని మార్చనున్నారు. (World Cup 2023) అక్టోబరు 15వతేదీన నవరాత్రి ఉత్సవాలను గుజరాత్ లో గార్బా రాత్రులుగా పండుగ జరుపుకుంటారు. (changed amid Navratri festival) ఈ పండుగ సందర్భంగా భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పెడితే భద్రతా సమస్యలు వస్తాయని వెల్లడైంది.

Flight Emergency Landing : వడగళ్ల వర్షంతో విమానానికి రంధ్రాలు…ఎమర్జెన్సీ ల్యాండింగ్

గుజరాత్ అంతటా గార్బా రాత్రులతో జరుపుకునే ముఖ్యమైన పండుగ. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ తేదీని పునఃపరిశీలించాలని బీసీసీఐకు సూచించారు. (India vs Pakistan match date) భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌లు గంటల్లోనే అమ్ముడవుతాయి. నవరాత్రి పండుగ కారణంగా తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐని హెచ్చరించాయి.

Indian Woman Anju love story : పాకిస్థానీతో అంజూ వివాహం…ఆమె తండ్రి ఏం చెప్పారంటే…

భారతదేశం వర్సెస్ పాకిస్థాన్ ప్రపంచ కప్ మ్యాచ్ తేదీని మార్చవచ్చు. అహ్మదాబాద్ నగరంలోని లక్ష మంది సామర్థ్యం కల నరేంద్ర మోదీ స్టేడియం న్యూజిలాండ్- ఇంగ్లండ్ మధ్య టోర్నమెంట్ ఓపెనర్, ఇండియా వర్సెస్ పాకిస్థాన్, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, ఫైనల్‌తో సహా ప్రపంచ కప్ నాలుగు గేమ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

Dating App : డేటింగ్ యాప్‌లో పరిచయం…మహిళపై అత్యాచారం

అహ్మదాబాద్ ఇప్పటికే అక్టోబర్ మధ్యలో హోటల్ వసతి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హోమ్‌స్టే ఎంపికలు కూడా అయిపోయాయి. పర్యవసానంగా విమాన ఛార్జీలు పెరుగుతాయని భావిస్తున్నారు. భారతదేశం వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం కొత్త తేదీని ప్రకటిస్తే ఈ చారిత్రాత్మక మ్యాచ్ చూడాలనే లక్ష్యంతో అభిమానులు పెద్ద ఎత్తున రీబుకింగ్ చేసుకునే అవకాశం ఉంది.