Flight Emergency Landing : వడగళ్ల వర్షంతో విమానానికి రంధ్రాలు…ఎమర్జెన్సీ ల్యాండింగ్

వడగళ్ల వర్షం కురవడంతో న్యూయార్క్‌కు వెళ్లే విమానం అత్యవరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. మిలన్ నుంచి న్యూయార్క్ నగరానికి వెళుతున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది....

Flight Emergency Landing : వడగళ్ల వర్షంతో విమానానికి రంధ్రాలు…ఎమర్జెన్సీ ల్యాండింగ్

Flight Emergency Landing

Flight Emergency Landing : వడగళ్ల వర్షం కురవడంతో న్యూయార్క్‌కు వెళ్లే విమానం అత్యవరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. మిలన్ నుంచి న్యూయార్క్ నగరానికి వెళుతున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. (Make Emergency Landing) విమానం టేకాఫ్ అయ్యాక వడగళ్ల వర్షం కురవడంతో విమానం రెక్కలు, ఇంజిన్, ఫ్యూజ్ లేజ్ దెబ్బతిన్నాయి. (Due To Extreme Turbulence)

Dating App : డేటింగ్ యాప్‌లో పరిచయం…మహిళపై అత్యాచారం

విమానం (New York Bound Flight) బయలుదేరిన 65 నిమిషాల తర్వాత ఎటువంటి ప్రమాదం లేకుండా ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. వడగళ్ల ధాటికి విమానానికి పెద్ద రంధ్రాలు పడ్డాయి. విమానంలో 215 మంది ప్రయాణికులు, ముగ్గురు పైలట్లు, 8 మంది విమాన సహాయకులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాలకే రోలర్ కోస్టర్ రైడ్ లాగా అలజడి ఏర్పడిందని ఓ ప్రయాణికుడు మీడియాకు తెలిపారు.

PM Kisan Samman Nidhi : రైతులకు శుభవార్త…రేపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు

వడగళ్ల వర్షం వల్ల విమానం రెక్కలు దెబ్బతినడాన్ని చూసినట్లు ఓ ప్రయాణికుడు చెప్పారు. విమానం ఇంజన్ కు రంధ్రం పడటంతో అది పాడైంది. వడగళ్ల వర్షం వల్ల విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశామని, విమాన ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి డెల్టా ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పింది.