PM Kisan Samman Nidhi : రైతులకు శుభవార్త…రేపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు

దేశంలోని రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 14వ విడత నిధులను గురువారం విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.....

PM Kisan Samman Nidhi : రైతులకు శుభవార్త…రేపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు

PM Kisan Samman Nidhi

PM Kisan Samman Nidhi : దేశంలోని రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 14వ విడత నిధులను గురువారం విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 8.5 కోట్ల మంది రైతులకు 14వ విడత నిధులను జులై 27వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. (PM KISAN 14th Installment) రాజస్థాన్‌ రాష్ట్రంలోని సికార్‌లో గురువారం ఉదయం 11 గంటలకు రైతులకు పీఎం కిసాన్ ఇన్ స్టాల్ మెంట్ నిధులను బదిలీ చేయనున్నారు. (To Be Transferred Tomorrow) ఈ సందర్భంగా ప్రధాని రైతులతో సమావేశమవుతారు.

Indian Woman Anju love story : పాకిస్థానీతో అంజూ వివాహం…ఆమె తండ్రి ఏం చెప్పారంటే…

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి లబ్ది పొందాలనుకునే రైతులు తమ బ్యాంక్ ఖాతాను వారి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని సూచించారు. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ లో పూర్తి చేసిన ఇ-కేవైసీని సమర్పించాలని కేంద్రం ఒక ట్వీట్‌లో పేర్కొంది. పిఎం కిసాన్ పథకాన్ని 2019వ సంవత్సరంలో పిఎం నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Plane Crashes : గ్రీస్ కార్చిచ్చు ఆర్పటానికి వచ్చిన విమానం కూలి ఇద్దరు పైలెట్ల మృతి

ఈ పథకాన్ని కొన్ని మినహాయింపులకు లోబడి, సాగు భూమితో దేశవ్యాప్తంగా ఉన్న రైతు కుటుంబాలకు ఆదాయ మద్ధతును అందించడం లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 6000 మొత్తాన్ని మూడు నెలల వాయిదాల్లో ఒక్కొక్కరికి రూ. 2000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తారు.