Chief Puppy Officer: కుక్కల్ని ఖుషీ చేయండీ..నెలకు రూ.2లక్షల జీతం తీసుకోండీ

Chief Puppy Officer: కుక్కల్ని ఖుషీ చేయండీ..నెలకు రూ.2లక్షల జీతం తీసుకోండీ

Chief Puppy Officer

Chief Puppy Officer : ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుసు సొలుపేమున్నది అనే పాట ఇదిగో ఈ ఉద్యోగానికి చక్కగా సరిపోతుంది. ఆడుకుంటే చాలు అదికూడా క్యూట్ క్యూట్ కుక్కలతో ఆడుకుంటే చాలు నెలకు ఏకంగా రూ.2 లక్షల జీతం ఇస్తానంటోంది నార్త్ ఈస్ట్ ఇంగ్లండ్ లోని ఓ సంస్థ. అదేంటీ కుక్కలతో ఆడుకుంటే జీతం ఇస్తారా? నిజంగా అటువంటి ఉద్యోగం ఉంటుందా? అనుకుంటాం. నిజమే మరి…ఆడుకుంటే జీతాలిస్తారా ఏంటీ? ఈరోజుల్లో..కానీ ఇది మాత్రం నిజమేనండోయ్..

టీమ్ డాగ్స్ నివేదిక ప్రకారం..మాంచెస్టర్ లో కుక్కతో ఆడుకుంటే నెలకు రూ.2,00,000 జీతం ఇస్తోంది ఓ సంస్థ. Yappy.com వెబ్‌సైట్ చీఫ్ పప్పీ ఆఫీసర్ పోస్టుల్ని నియమిస్తోంది. వారికి 24,000 పౌండ్లు భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.24,00,000 జీతం ప్రకటించింది. అంటే నెలకు రూ.2,00,000 లు జీతం అన్నమాట.

ఉద్యోగంలో చేయాల్సిందేమంటే..
చీఫ్ పప్పీ ఆఫీసర్ Yappy.com దగ్గర ఉన్న కుక్కలను 8 గంటల పాటు జాగ్రత్త చూసుకోవాలి. అవి ఎప్పుడూ ఉల్లాసంగా..ఉండేలా చూసుకోవాలి. 420 పైగా బ్రీడ్స్‌ని పర్సనలైజ్డ్ గిఫ్ట్‌గా మార్చాలి. కుక్కలను అత్యంత జాగ్రత్తగా చూసుకునేవారికి మాత్రమే ఈ ఉద్యోగం అని స్పష్టంగా రాయబడి ఉంది.ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాటిని చూసుకుంటూ ఉండటమే చీఫ్ పప్పీ ఆఫీసర్ చేయాల్సిన పని. వాటికి చక్కిలిగిలి పెడుతూ, ఎంటర్‌టైన్ చేస్తూ, ఆడుకుంటే చాలు. అలాగే అవి ఎప్పుడు హుషారుగా ఉండేలా చూడాలి..వాటితో ఆడాలి..వాటి సంతోషంగా ఉంచటమే పనిగా ఉండాలి.

దీంతో పాటు శునకాలు ఏం ఇష్టపడుతున్నాయి, వాటికి ఎలాంటి బొమ్మలు నచ్చుతాయి, ఎలాంటి యాక్సెసరీస్ తయారు చేయొచ్చు అనే అంశాలతో మార్కెట్ రీసెర్చ్ కూడా చేయాల్సి ఉంటుంది. చీఫ్ పప్పీ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు Yappy.com వెబ్‌సైట్‌లో ఉన్నాయి. కుక్కలంటే ఇష్టం ఉన్నవారు ఈ ఉద్యోగాన్ని ఎలా కాదనగలరు? అన్నట్లుగా ఉందీ ఉద్యోగం.

కుక్కలంటే విపరీతమైన ప్రేమ, ఇష్టం ఉన్నవారికి ఇటువంటి ఉద్యోగాలు బాగా సూట్ అవుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు కూడా అటువంటివారైతే వెంటనే అప్లై చేయండీ..కుక్కలతో ఆడుకోండీ..నెలకు రూ.2 లక్షల జీతం తీసుకోండీ..