China : ఏ పనీ చేయడట.. ప్రశాంతత కావాలట.. 200 రోజులుగా టెంట్‌లోనే ఉంటున్న యువకుడు

29 సంవత్సరాలు అంటే చక్కగా ఉద్యోగం చేసుకుని సెటిల్ అయ్యే వయసు. కానీ ఓ యువకుడికి ఏ పనీ పాటా లేకుండా ప్రశాంతంగా బ్రతకాలని ఉందట. ఓ టెంట్ వేసుకుని 200 రోజులుగా అందులోనే నివాసం ఉంటున్నాడు. అతనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

China : ఏ పనీ చేయడట.. ప్రశాంతత కావాలట.. 200 రోజులుగా టెంట్‌లోనే ఉంటున్న యువకుడు

China

young man living in a tent : ప్రశాంతత కోసం ఉద్యోగం మాయేయడమేంటి? టెంట్‌లో నివాసం ఉండటమేంటి? వింతగా అనిపిస్తోంది కదా.. ఓ చైనా యువకుడికి ఉద్యోగం చేయాలని లేదట.. ప్రశాంతంగా బతకాలని ఉందట. 200 రోజులుగా ఓ టెంట్‌లో నివాసం ఉంటున్నాడు.

 

చైనా సిచువాన్‌కు చెందిన 29 ఏళ్ల లిషు అనే యువకుడు 2018 నుంచి జాబ్ మానేశాడు. కొద్దిరోజులు అద్దె ఇంట్లో ఉన్నాడు. అద్దె కట్టడం కష్టం కావడంతో తన దగ్గర ఉన్న కంప్యూటర్, కెమెరా అమ్మేశాడు. అవి అమ్మగా 400 యువాన్లు (రూ.4,700) వచ్చాయి. వాటితో ఓ సెకండ్ హ్యాండ్ టెంట్ కొన్నాడు.

Strange Rule in School : స్కూల్లో వింత రూల్..విద్యార్ధులు టాయిలెట్ వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికెట్ కావాలంట!!

రాళ్లు, రప్పలు నిండి ఉన్న కార్లు పార్క్ చేసే ఏరియాలో టెంట్ వేసుకున్నాడు. ఇక ఆ టెంట్‌లో రిలాక్స్ అవుతూ తనకి నచ్చినవి వండుకుంటూ తింటున్నాడు. ఆ టెంట్‌కి ఓ బోర్డు పెట్టాడు. టెంట్‌లో ఉన్న వస్తువులు ముట్టుకోవద్దని.. తాను అక్కడ టెంపరరీగా ఉండటానికి వచ్చానని .. ఎవరికైనా అభ్యంతరం ఉంటే అక్కడి నుంచి వెళ్లిపోతానని ఆ బోర్డ్ లో చెప్పాడు.

 

లిషు అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాడు. బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవడానికి, వంట సామాగ్రి కోసం మాత్రమే వెళ్తుంటాడు. ఇతని కష్టాలు చూసిన స్నేహితుడు అకామిడేషన్ ఇస్తానని.. డబ్బులు ఇస్తానని.. బిజినెస్ ఆఫర్ ఇస్తానని కూడా బతిమాలిన లిషు ససేమిరా అన్నాడు. ఇదీ ప్రస్తుతం లిషు లైఫ్ స్టైల్. అతని దగ్గర ఉన్న డబ్బులు అయిపోయిన తర్వాతైనా తిరిగి కష్టపడాల్సిందే కదా.. అప్పటి వరకూ తను కోరుకున్న ప్రశాంతతని అనుభవించనీ అని అందరూ అతనిని పట్టించుకోవడం మానేశారట.

SHOCKING News : భర్త చితాభస్మాన్ని తింటున్న మహిళ..కంపుకొడుతున్నా మాననంటోంది..

ఇతని గురించి తెలిసిన వారంతా ‘ ఇలా ఉండటం చాలా కష్టం.. సన్యాసుల్లో చేరమని’ .. ‘తనకి నచ్చినంత కాలం ఇలా ఉండొచ్చు కానీ ఇది బతకడానికి మార్గం కాదని’ చెప్పారట. లిషు ఎవరి మాటైనా వింటే కదా.. అవసరం అతనికి మళ్లీ బాధ్యతను గుర్తు చేయచ్చు బహుశా.  కానీ అతని వింత మనస్తత్వానికి జనం ఆశ్చర్యపోతున్నారు.