Strange Rule in School : స్కూల్లో వింత రూల్..టాయిలెట్ వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికెట్ కావాలంట!!

విద్యార్ధులు టాయిలెట్ కు వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలనే రూల్ పెట్టిందో ఓ స్కూల్.

10TV Telugu News

Doctor certificate for students to go to the toilet : స్కూల్ కు వెళ్లిన విద్యార్ధులకు టాయిలెట్ కు వెళ్లాలంటే టీచర్ పర్మిషన్ తీసుకుని వెళతారు. ఇది ఎక్కడైనా జరిగేదే. కానీ ఓ స్కూల్ యాజమాన్యం మాత్రం విద్యార్ధులు టాయిలెట్ కు వెళ్లాలంటే ఎక్కడా కనీ వినీ ఎరుగని రూల్ పెట్టింది. విద్యార్ధులు టాయిలెట్ కు వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలంట. క్లాసులు జరుగుతున్నప్పుడు టాయిలెట్ కు వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి అని రూల్ పెట్టింది..!! ఎంత అర్జంట్ అయినాసరే ..సర్టిఫికెట్ చూపించనిదే టాయిలెట్ కువెళ్లనిచ్చేది లేదంటోంది..ఇంగ్లాండ్‌ వేమౌత్‌లోని వైక్ రెగిస్‌లోని ఆల్ సెయింట్స్ స్కూల్‌ యాజమాన్యం.

క్లాస్‌ లు జరుగుతున్న సమయంలో మధ్యలో టాయిలెట్‌ వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. ఈ రూల్స్‌ పై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల కూడా మండిపడుతున్నారు. టాయిలెట్ కు వెళ్లటమనేది సర్వసాధారణ విషయం అని..దీనికి డాక్టర్‌ సర్టిఫికెట్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. గర్ల్స్‌ కు పిరియడ్స్‌ లో ఉన్నా లేదా సడెన్ గా పీరియడ్స్ వస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.

పైగా అక్కడితో ఆగలేదు ఈ స్కూల్ మెంటల్ రూల్స్..ఆడపిల్లలు క్లాసు మధ్యలో పీరియడ్స్ వచ్చిందని బయటకు వెళతామంటే పర్మిషన్ ఇచ్చేది లేదంటోంది. స్కూల్ కు వచ్చే ఆడపిల్లలు పీరియడ్స్ రాకుండా పిల్స్ వేసుకోవాలని..లేకుంటే మధ్యలో పీరియడ్స్ వచ్చినా పంపించేది లేదని తెగేసి చెబుతోంది. అలా జరగకుండా ఉండాలంటే విద్యార్థినిలు పిరియడ్స్‌ రాకుండా మాత్రలు వేసుకోవాలని కూడా చెబుతున్నారు స్కూల్‌ ఉపాధ్యాయులు. ఈ స్కూల్‌ రూల్స్‌ గురించి తెలిసిన వారు… తీవ్రంగా మండిపడుతున్నారు.విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటమాడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ స్కూల్లో విద్యార్ధులు కూడా టాయిలెట్ కు వెళ్లాలని అర్జంట్ ఉన్నా పంపించటంలేదని దీంతో స్కూల్ కు రావాలంటేనే భయంగా ఉందని అంటున్నారు. అది స్కూల్ కాదు జైలులాగా అనిపిస్తోందని విద్యార్ధిని విద్యార్ధులు వాపోతున్నారు.దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్ జాన్ కార్నిష్ మాట్లాడుతు..ఓ పిచ్చి రీజన్ చెప్పారు. ఈ రూల్ కంఫర్ట్ బ్రేక్స్ అలవాటు చేయటానికి విద్యార్ధులకు ఉపయోగపడుతుందని తెలిపారు. లేదంటే అర్జంట్ అయితే టాయిలెట్ కార్డు (డాక్టర్ సర్టిఫికెట్) ఉన్నవారు వెళ్లవచ్చని తెలిపారు.

కానీ దీనిపై విద్యార్ధులు మాత్రం మరోలా చెబుతున్నారు. టాయల్ లెట్ డోర్స్ రిపేర్ లో ఉన్నాయని వాటిని ఎప్పుటినుంచో రిపేర్ చేయించకుండా అలానే ఉంచారని టాయిలెట్ కు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు. దానికి ప్రిన్సిపల్ మాత్రం మరో కారణం చెప్పారు. డోర్స్ రిపేర్ లో ఉన్నమాట నిజమేననీ..కానీ టాయిలెట్ వెళ్లటానికి పర్మిషన్ ఇవ్వకపోవటానికి అది కారణం కాదనీ..వాటిని రిపేర్ చేయిస్తున్నామని తెలిపారు. అందుకే విద్యార్ధులు క్లాసులు బ్రేక్ సమయంలో మాత్రమే టాయిలెట్ యూజ్ చేయాలని..తెలిపామన్నారు.

ఇంగ్లాండ్‌ వేమౌత్‌లోని వైక్ రెగిస్‌లోని ఆల్ సెయింట్స్ స్కూల్‌ లో ఓ వింత రూల్‌ పెట్టింది యాజమాన్యం. స్కూల్‌ కు వచ్చే పిల్లలు… తరగతులు జరుగుతున్న సమయం లో అస్సలు టాయిలెట్‌ వెళ్లకూడదని రూల్స్‌ పెట్టింది. ఎంత అత్యవరసరమున్న… వెళ్లడానికి వీలు లేదని పేర్కొంది. అయితే… తరగతులు జరుగుతున్న సమయం లో కచ్చితంగా టాయిలెట్‌ వెళ్లాలని అనుకుంటే… ఏదైనా డాక్టర్‌ సర్టిఫికేట్‌ తీసుకురావాలని..నిబంధనలు పెట్టింది.