SRH vs CSK live: హైదరాబాద్‌పై చెన్నై విజయం

  • Published By: vamsi ,Published On : October 13, 2020 / 06:16 PM IST
SRH vs CSK live: హైదరాబాద్‌పై చెన్నై విజయం

[svt-event title=”చెన్నైదే విజయం” date=”13/10/2020,11:22PM” class=”svt-cd-green” ] ఐపిఎల్ 2020లో 29వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20పరుగుల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 8వికెట్లు నష్టానికి 147పరుగులు మాత్రమే చేసింది. [/svt-event]

[svt-event title=”చెన్నై స్కోరు 167/6.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టార్గెట్ 168″ date=”13/10/2020,9:19PM” class=”svt-cd-green” ] టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 167పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టార్గెట్ 168పరుగులుగా ఫిక్స్ అయ్యింది.

టాస్ గెలిచిన తరువాత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా వచ్చిన ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరుకోగా.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఆల్ రౌండర్ శామ్ కుర్రాన్ 21 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

అనంతరం అంబటి రాయుడు, షేన్ వాట్సన్ చెన్నై ఇన్నింగ్స్‌ను నడిపించారు. రాయుడు 34 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు సాయంతో 41 పరుగులు చేశాడు. అదే సమయంలో, వాట్సన్ 38 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్లతో 42 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 81 పరుగుల కీలక భాగస్వామ్యం జట్టుకు అందజేశారు.

అయితే రెండు వరుస ఓవర్లలో వాట్సన్, రాయుడు అవుట్ అయిన తరువాత, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని స్కోరును 165కి తీసుకున్నారు. ధోని 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా మూడు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో కేవలం 10 బంతుల్లో 25 పరుగులు చేశాడు.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్లందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సందీప్ శర్మ అత్యంత విజయవంతం అయ్యాడు. సందీప్ తన కోటాలోని నాలుగు ఓవర్లలో 19 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టగా.. అదే సమయంలో ఖలీల్ అహ్మద్, టి నటరాజన్ కూడా తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

[/svt-event]

[svt-event title=”ధోనీ అవుట్.. స్కోరు 152/5″ date=”13/10/2020,9:12PM” class=”svt-cd-green” ] వాట్సన్‌(42), రాయుడు(41) అవుట్ అయిన తర్వాత చెన్నై జట్టు నిదానంగా ఆడుతుంది స్కోరు బోర్డు నెమ్మదిగా సాగుతుంది.. ఈ క్రమంలో 19 ఓవర్లకు చెన్నై ఐదు వికెట్లు నష్టపోయి 152పరుగులు చేసింది. ధోనీ 13బంతుల్లో 21పరుగులు చేసి అవుట్ అవగా.. జడేజా, బ్రావో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”నాలుగు వికెట్లు కోల్పోయిన చెన్నై.. స్కోరు 129/4″ date=”13/10/2020,8:58PM” class=”svt-cd-green” ] నిలకడగా రాణిస్తున్నట్లుగా కనిపించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడవ వికెట్‌ను కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించి రాయుడు పెవిలియన్‌కు చేరాడు. రాయుడు 34బంతుల్లో 41పరుగులు చేశాడు. రాయుడు అవుట్ అయిన వెంటనే తర్వాతి ఓవర్లో నటరాజన్ బౌలింగ్లో వాట్సన్‌ (42) పాండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ధోనీ, జడేజా క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై.. స్కోరు 39/2″ date=”13/10/2020,8:04PM” class=”svt-cd-green” ] టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పవర్ ప్లే లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ వికెట్‌గా డూప్లెసిస్ అవుట్ అవగా.. రెండవ వికెట్‌గా శామ్ కర్రన్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం షేన్ వాట్సన్, అంబటి రాయుడు క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. హైదరాబాద్ బౌలింగ్!” date=”13/10/2020,7:08PM” class=”svt-cd-green” ] దుబాయ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు.. మొదట బ్యాటింగ్ ఎంచుకుని హైదరాబాద్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. [/svt-event]

[svt-event title=”హాట్ ఫేవరేట్‌గా హైదరాబాద్:” date=”13/10/2020,6:55PM” class=”svt-cd-green” ] Dubai International Cricket Stadiumలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్ మాత్రం హైదరాబాద్.. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇవే కాకుండా జట్టులో మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, అభిషేక్ శర్మ ఉన్నారు.

చివరి మ్యాచ్‌లో అబ్దుల్ షమాద్‌కు బదులుగా విజయ్ శంకర్‌కు అవకాశం లభించింది. అతను నేటికీ జట్టులో ఉండే అవకాశం ఉంది. బౌలింగ్‌కి వస్తే హైదరాబాద్‌కు బెస్ట్ బౌలింగ్ ఉంది. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. పరుగులు కట్టడి చెయ్యడంలోనే కాదు.. వికెట్లు తీయడానికి కూడా ఉపయోగపడుతూ ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ జట్టుకు దూరం అవ్వడంతో ఖలీల్ అహ్మద్, నటరాజన్ బాగా రాణిస్తున్నారు. [/svt-event]

[svt-event title=”చివరి మ్యాచ్‌లో చెత్తగా ఆడిన చెన్నై.. పోరాడి ఓడిన హైదరాబాద్” date=”13/10/2020,6:28PM” class=”svt-cd-green” ] చెన్నై తన చివరి మ్యాచ్‌‌లో బెంగళూరు జట్టు చేతిలో భారీ తేడాతో చెత్తగా ఆడి ఓడిపోగా, హైదరాబాద్ తన చివరి మ్యాచ్‌ను రాజస్థాన్ చేతిలో పోరాడి ఓడిపోయింది. టోర్నమెంట్ మ్యాచ్‌ల్లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు ఆడాయి. ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ ముఖ్యమైనది ప్లేఆఫ్‌లకు వెళ్లాలంటే కచ్చితంగా మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే చావో రేవో మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుంది అనేది ఆసక్తికరమే. [/svt-event]

[svt-event title=”Probable XIs:” date=”13/10/2020,6:22PM” class=”svt-cd-green” ]

Sunrisers Hyderabad: డేవిడ్ వార్నర్ (C), జానీ బెయిర్‌స్టో (wk), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టీ నటరాజన్, ఖలీల్ అహ్మద్

Chennai Super Kings: షేన్ వాట్సన్, ఎన్ జగదీషన్, ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, శామ్ కుర్రాన్, ఎంఎస్ ధోని(C&WK), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, కరణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్ [/svt-event]

[svt-event title=”ఈ సీజన్‌లో రెండవ మ్యాచ్:” date=”13/10/2020,6:17PM” class=”svt-cd-green” ] ఈ సీజన్‌లో రెండవ మ్యాచ్ ఇరు జట్లు ఆడుతుండగా.. అక్టోబర్ 2వ తేదీన జరిగిన మ్యాచ్‌లో 7పరుగుల తేడాతో చెన్నైపై హైదరాబాద్ విజయం సాధించింది. [/svt-event]

[svt-event title=”హైదరాబాద్‌తో 13సార్లు తలపడ్డ ధోనీ సేన” date=”13/10/2020,6:16PM” class=”svt-cd-green” ] ఎస్‌ఆర్‌హెచ్, CSK జట్లు ఐపిఎల్‌లో 13 సార్లు తలపడగా.. అందులో చెన్నై సూపర్ కింగ్స్ 9 సార్లు గెలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు సార్లు మాత్రమే గెలిచింది. నేటి పోటీ కఠినమైనదే కాగా.. ఈ మ్యాచ్‌లో గెలవకపోతే చెన్నై జట్టుకు దాదాపుగా ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు అయ్యినట్లే. చావోరేవో తేల్చుకునేందుకు నేడు ధోనీ సేన సిద్ధం అవుతుంది. [/svt-event]

[svt-event title=”Hyderabad vs Chennai, 29th Match – ” date=”13/10/2020,6:07PM” class=”svt-cd-green” ] ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లో మరో కీలకమైన మ్యాచ్‌లో ఇవాళ(13 అక్టోబర్ 2020) చెన్నై సూపర్ కింగ్స్(CSK) సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తలపడబోతున్నాయి. పాయింట్ల పట్టికలో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7వ స్థానంలో ఉండగా.. సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి.. అందులో 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయి ఈ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది చెన్నై జట్టు.

అదే సమయంలో, డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చెన్నై జట్టు కంటే కాస్త మెరుగైన స్థితిలో ఉంది. కానీ హైదరాబాద్ ఆటతీరు ఇతర జట్ల కంటే మాత్రం మెరుగ్గా లేదు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్‌లు ఆడగా.. అందులో మూడు మ్యాచ్‌లు గెలిచి నాలుగు ఓడిపోయారు. SRH జట్టు పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది.[/svt-event]