new Covid cases : దేశంలో 24గంటల్లో 1,096 కొవిడ్ కొత్త కేసులు.. 81 మంది మృతి

దేశంలో కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 81 మరణాలు నమోదైనట్లు..

new Covid cases : దేశంలో 24గంటల్లో 1,096 కొవిడ్ కొత్త కేసులు.. 81 మంది మృతి

New Covid Cases

new Covid cases : దేశంలో కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 81 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. భారతదేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,21,345 కు చేరుకోగా, యాక్టివ్ కేసులు 13,013గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,447 రికవరీలు నమోదయ్యాయి, మొత్తం రికవరీల సంఖ్య 4,24,93,773కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు 0.03శాతంగా నమోదుకాగా, రికవరీ రేటు 98.76 శాతానికి మెరుగుపడినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Omicron New Variant : కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గుర్తింపు

మరోవైపు దేశవ్యాప్తంగా 24 గంటల్లో 4,65,904 పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా 15ఏళ్ల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటి వరకు 184.66కోట్ల టీకాలు అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. కొవిడ్ సోకినవారి సంఖ్య 490.6 మిలియన్లకు చేరుకుంది. మరణాలు 6.15 మిలయన్లకు చేరుకున్నాయి. కొవిడ్ నివారణలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా టీకా పంపిణీ 10.97 బిలియన్లకు చేరుకున్నట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

COVID-19 Outbreak: చైనాలో కొత్తరకం వైరస్.. షాంఘై నగరంలో లాక్ డౌన్!

కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్లు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. మ్యుటేషన్‌ కారణంగా కొత్తగా పుట్టుకొస్తున్న హైబ్రిడ్‌ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సూచించింది. ఇప్పటివరకు XD, XE, XF అనే మూడు హైబ్రిడ్‌ రకాలను గుర్తించినట్లు తెలిపిన ప్రపంచ ఆరోగ్యసంస్థ.. ఎక్స్‌ఈ స్ట్రెయిన్‌ (ఒమిక్రాన్‌ రెండు వేరియంట్ల ఉపరకమైన హైబ్రిడ్‌ స్ట్రెయిన్‌)లో 10శాతం పెరుగుదల రేటు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. కొత్తగా బయట పడిన కరోనా మ్యుటెంట్ ‘ఎక్స్ఈ’కి మరింత వేగంగా వ్యాపించే గుణం ఉందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. కరోనా ఒమిక్రాన్ లో ఉప రకమైన బీఏ.2 (స్టెల్త్ కరోనా)ను ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ గా పరిగణిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.