Greyhounds Land Scam : రూ.10వేల కోట్ల విలువైన భూములను కాపాడిన 10TV.. ప్రభుత్వం అభినందనలు

టెన్ టెవీ ఎఫెక్ట్ తో రూ.10వేల కోట్ల విలువ చేసే ల్యాండ్ స్కామ్ కు బ్రేక్ పడింది. ప్రభుత్వ భూములను కొట్టేయాలనుకున్న మాజీ ఐపీఎస్ అధికారి వ్యవహారానికి చెక్ చెప్పిన హైకోర్టు..

Greyhounds Land Scam : రూ.10వేల కోట్ల విలువైన భూములను కాపాడిన 10TV.. ప్రభుత్వం అభినందనలు

Greyhounds Land Scam

Updated On : December 31, 2021 / 7:56 PM IST

Greyhounds Land Scam : రూ.10వేల కోట్ల విలువైన భూములను కాపాడిన టెన్ టీవీకి(10tv) రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ అభినందనలు తెలిపారు. గ్రేహౌండ్స్ ల్యాండ్స్ కబ్జాపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసిందని, దాంతో భూ కబ్జాకోర్లపై ఒత్తిడి పెరిగిందన్నారు. ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తామని ఆర్డీవో చెప్పారు. ప్రభుత్వం తరుపున బలమైన వాదనలతో హైకోర్టులో విజయం దక్కిందన్నారు. అత్యంత విలువైన భూమి ప్రభుత్వానికి రావడంలో కృషి చేసిన అధికారులకు ఆర్డీవో కృతజ్ఞతలు తెలిపారు.

Realme XT Explode : కొన్న గంటకే పేలిన రియల్‌మి ఫోన్.. ట్విట్టర్‌లో ఫొటోలు వైరల్..!

”గ్రేహౌండ్స్ భూమిని యు అండ్ ఎ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసే ప్రయత్నం చేసింది. ఇందులో ఆరోగ్యరెడ్డి, ఉమాదేవిలపై ఆరు కేసులు నమోదయ్యాయి. పుప్పాలగూడ, మణికొండ, మియాపూర్ లో కూడా వేలాది కోట్ల భూమి కబ్జాకు గురైంది. ఈ కబ్జాలపైనా త్వరలోనే ప్రభుత్వం విజయం సాధిస్తాం. ఎవరైనా సరే రికార్డులు చూసుకుని భూములను కొనుగోలు చేయండి. తప్పుడు పత్రాలతో భూములు కొని మోసపోవద్దు. తక్కువ ధరలు అంటూ రియల్టర్లు మోసం చేస్తారు. అప్రమత్తంగా ఉండండి. రెవెన్యూలో ప్రతి గజం భూమికి రికార్డులు ఉన్నాయి” అని రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ చెప్పారు.

టెన్ టెవీ ఎఫెక్ట్ తో రూ.10వేల కోట్ల విలువ చేసే ల్యాండ్ స్కామ్ కు బ్రేక్ పడింది. టెన్ టీవీ వరుస కథనాలతో బయటపడ్డ భూబాగోతం హైకోర్టు తీర్పుతో కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ భూములను కొట్టేయాలనుకున్న మాజీ ఐపీఎస్ అధికారి వ్యవహారానికి చెక్ చెప్పిన హైకోర్టు.. టెన్ టీవీ చెప్పినట్లే అవి ప్రభుత్వ భూములని తేల్చింది.

Dhanurasana : ధనురాసనంతో కండరాలు బలోపేతం

ల్యాండ్ స్కామ్ వ్యవహారం టెన్ టీవీ దృష్టికి రావడంతో వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై కోర్టుకెళ్లింది. గతంలో మాజీ ఐపీఎస్ కుటుంబసభ్యులు ఉమాదేవి, ఆరోగ్యరెడ్డి పేరిట అగ్రిమెంట్లు జరిగాయి. వెంటనే దానిపై భూభక్షకుడి పేరుతో టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక నివేదిక తెప్పించుకుంది. దీని ఆధారంగా ప్రభుత్వం కోర్టుని ఆశ్రయించగా, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని కోర్టు తీర్పు వెలువరించింది. తెలంగాణ డీజీపీ, గ్రేహౌండ్స్, రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు.