Corona Flight: దేశంలోకి కరోనాను మోసుకొస్తున్న విమాన ప్రయాణికులు

ఇటలీ నుంచి అమృత్‌సర్ వచ్చిన మరో విమానంలో 172 మంది ప్రయాణికులకు కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తుంది.

Corona Flight: దేశంలోకి కరోనాను మోసుకొస్తున్న విమాన ప్రయాణికులు

Flight

Corona Flight: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోమారు విలయతాండవం చేస్తుంది. అమెరికా, యూరోప్ సహా తూర్పు ఆసియా దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ప్రధానంగా యూరోప్ లోని ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జనవరి 6న ఇటలీ నుండి భారత్ లోని అమృత్‌సర్ చేరుకున్న ఒక విమానంలో 125 మందికి కరోనా నిర్ధారణ అవడం సంచలనంగా మారింది. కరోనా బాధితులను అధికారులు క్వారంటైన్ కు తరలించారు. ఇదిలా ఉంటే.. ఇటలీ నుంచి అమృత్‌సర్ వచ్చిన మరో విమానంలో 172 మంది ప్రయాణికులకు కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తుంది. మొత్తం 285 మంది ప్యాసింజర్లు ఉన్న ఆ విమానంలో, ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుపగా, 172 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో వారిని క్వారంటైన్ కు తరలించారు.

Also read: India Covid : ఢిల్లీలో వీకెండ్..అస్సాంలో నైట్ కర్ఫ్యూ..కర్ణాటకలో వైన్స్ క్లోజ్

ఇదిలాఉంటే.. తాము ప్రయాణానికి ముందు చేయించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ నెగటివ్ వచ్చిందంటూ.. ప్రయాణికులు తమ రిపోర్ట్ ను భారత అధికారులకు అందించారు. అయితే ఇక్కడకు చేరుకున్న అనంతరం జరిపిన పరీక్షల్లో వారికీ కోవిడ్ పాజిటివ్ గా తేలడం గందరగోళానికి గురిచేస్తుంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో దాదాపు 99 శాతం మంది రెండు డోసుల కరోనా వాక్సిన్ కూడా తీసుకున్నట్లు తెలిపారు. భారత్ లో జరుపుతున్న కోవిడ్ పరీక్షల్లో లోపాలు ఉన్నాయంటూ ప్రయాణికులు వాపోయారు. దీనిపై స్పందించిన పంజాబ్ వైద్యాధికారులు.. కరోనా పరీక్షా కేంద్రాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెలకొన్న గందరగోళంతో ప్రయాణికులను ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాలకు తరలించలేదు. 13 మందిలో ముగ్గురు మాత్రమే ప్రభుత్వాసుపత్రిలో ఐసొలేషన్ కు వెళ్లగా, పది మంది స్వీయ నియంత్రణలోకి వెళ్లారు.

Also Read: Groom Escaped : పెళ్లి ముహూర్తం సమయానికి వరుడు పరార్