18 Pages : ఎన‌ర్జిటిక్‌ హీరో నిఖిల్ – బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్‌‌ కాంబినేష‌న్‌లో ‘18 పేజీస్’..

అర్జున్ సుర‌వ‌రం’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత‌ యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ పరమేశ్వరన్ జంట‌గా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ‘18 పేజీస్’..

18 Pages : ఎన‌ర్జిటిక్‌ హీరో నిఖిల్ – బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్‌‌ కాంబినేష‌న్‌లో ‘18 పేజీస్’..

18 Page

18 Pages: ‘అర్జున్ సుర‌వ‌రం’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత‌ యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ పరమేశ్వరన్ జంట‌గా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ‘18 పేజీస్’.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణలో, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్‌ ప్లే అందిస్తూ, ‘100 ప‌ర్సెంట్ లవ్’, ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’, ‘గీత‌ గోవిందం’, ‘ప్ర‌తిరోజూ పండుగే’ వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌తో స‌క్స‌ెస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన యంగ్ నిర్మాత బ‌న్నివాసు జీఏ 2 పిక్చ‌ర్స్ మ‌రియు ‘ఉప్పెన’ వంటి స‌న్సెషేన‌ల్ హిట్ అందుకుని విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న సుకుమార్ రైటింగ్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

18 Pages

‘18 పేజీస్’ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ నుండి అనూహ్య స్పంద‌న ల‌భించింది. అలానే స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండ‌టం, ‘కుమారి 21 ఎఫ్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో, నిఖిల్ – అనుప‌మ కాంబినేష‌న్, జీఏ2 పిక్చ‌ర్స్ – సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణం వెర‌సి ‘18 పేజీస్’ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

18 Pages

ఈ నేప‌థ్యంలో జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘18 పేజీస్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అప్‌డేట్ పోస్టర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ అబ్బాయ్ చేతిలో ఫోను, ఓ అమ్మాయి చేతిలో పెన్ ఉన్న స్టిల్స్‌తో ఈ అప్‌డేట్ పోస్టర్ విడుద‌ల చేశారు. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చెయ్యబోతున్నారు.