Denmark: డెన్మార్క్‌లోని షాపింగ్ మాల్‌లో కాల్పుల క‌ల‌క‌లం.. ఉగ్ర‌వాదుల చ‌ర్యే?

డెన్మార్క్ రాజ‌ధాని కోపెన్‌హాగన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురికి గాయాల‌య్యాయి. ఈ కాల్పుల‌కు పాల్ప‌డింది ఉగ్ర‌వాదులేన‌న్న అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

Denmark: డెన్మార్క్‌లోని షాపింగ్ మాల్‌లో కాల్పుల క‌ల‌క‌లం.. ఉగ్ర‌వాదుల చ‌ర్యే?

Denmark: డెన్మార్క్ రాజ‌ధాని కోపెన్‌హాగన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురికి గాయాల‌య్యాయి. ఈ కాల్పుల‌కు పాల్ప‌డింది ఉగ్ర‌వాదులేన‌న్న అనుమానాలు త‌లెత్తుతున్నాయి. కాల్పులకు పాల్ప‌డిన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు జ‌రుపుతున్నారు. షాపింగ్ మాల్‌లోకి దూసుకువ‌చ్చిన ఓ వ్య‌క్తి అందులో క‌లియ‌తిరుగుతూ కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడ‌ని పోలీసులు వివ‌రించారు.

Sri Lanka crisis: పెట్రోల్, డీజిల్ కొర‌త‌.. శ్రీ‌లంక‌లో ఇప్ప‌టికీ తెరుచుకోని పాఠ‌శాల‌లు

ఈ ఘ‌ట‌న‌లో గాయాల‌పాలైన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నామ‌ని చెప్పారు. కాల్పుల మోత‌తో షాపింగ్ మాల్ నుంచి కొంద‌రు బ‌య‌ట‌కు ప‌రుగులు తీశార‌ని స్థానికులు తెలిపారు. షాపింగ్ మాల్‌లోనే ఉండిపోయిన త‌మ వారి కోసం ప‌లువురు ఫోన్లు చేస్తూ కంగారుగా క‌న‌ప‌డ్డార‌ని చెప్పారు. కాల్పుల ఘ‌ట‌న గురించి తెలుసుకున్న వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. అక్క‌డ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌డంతో అద‌న‌పు బ‌ల‌గాల‌నూ రప్పించామ‌ని చెప్పారు.