Bangalore : కుప్పకూలిన మరో భవనం.. పదిరోజుల వ్యవధిలో ఇది మూడవది

గురువారం బెంగళూరులోని కస్తూరినగర్‌లో మూడంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కొద్దిగా పక్కకు ఒరగడంతో అందులోకి వారంతా ఖాళీ చేశారు.. ఖాళీ చేసిన కొద్దీ సేపటికే భవనం కుప్పకూలింది.

Bangalore : కుప్పకూలిన మరో భవనం.. పదిరోజుల వ్యవధిలో ఇది మూడవది

Bangalore

Bangalore : గురువారం బెంగళూరులోని కస్తూరినగర్‌లో మూడంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కొద్దిగా పక్కకు ఒరగడంతో అందులోకి వారంతా ఖాళీ చేశారు.. ఖాళీ చేసిన కొద్దీ సేపటికే భవనం కుప్పకూలింది. కాగా ఈ భవనం 2014లో నిర్మించినట్లు యజమాని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీస్, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం బీబీఎంపీ కమిషనర్ గౌరవ్ గుప్తా భవనం కూలిన ప్రాంతానికి వచ్చారు.

Read More : Building Collapse : బెంగళూరులో కుప్పకూలిన మరో భవనం

“60 × 40 స్థలంలో గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులను నిర్మించడానికి వారికి అనుమతి ఉంది. నిబంధనలు అతిక్రమించి మూడు అంతస్తులు నిర్మించారు. తాజాగా పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే భవనం కుప్పకూలింది. ఇక ఘటనపై కమిషనర్ గుప్తా మాట్లాడుతూ.. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి భవనం నిర్మించడం వల్లనే ఇలా జరిగిందని తెలిపారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తిచే పనిలో ఉన్నామన్నారు.

Read More : Building Collapse : చూస్తుండగానే కుప్పకూలిన భవనం.. వైరల్ వీడియో

సెప్టెంబర్ 27న లక్కసంద్రలో మూడు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ భవనంలో మెట్రో కార్మికులు నివాసం ఉంటున్నారు. ఆ భవనం పగుళ్లు గుర్తించి బయటకు వచ్చారు. వారు బయటకు వచ్చిన కొద్దీ సేపటికే భవనం కుప్పకూలింది. పది రోజుల వ్యవధిలో మూడు భవనాలు కులాగా అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.