Weight Loss : మగవారి కోసం బరువును తగ్గించే 5 టిప్స్!

రోజువారిగా తీసుకునే భోజనంలో సమతుల్య ఆహారం తీసుకోవటం ఉత్తమం. బరువు తగ్గాలనుకుంటే, మీరు తీసుకునే ప్రతి భోజనంలో పోషకాలను సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. 40% ప్రోటీన్లు, 35% పిండి పదార్థాలు మరియు 25% ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండాలి.

Weight Loss : మగవారి కోసం బరువును తగ్గించే 5 టిప్స్!

Weight Loss : మనమందరం ఫిట్‌గా ఉండటానికి, బరువు తగ్గించుకోవడానికి అనేక మార్గాల గురించి ఆలోచిస్తుంటాయి. అయితే అవి ఎంత వరకు ఆచరణాత్మకమైనవి అనేది ప్రశ్నే. కార్బోహైడ్రేట్ డైట్, కీటో డైట్, పాలియో డైట్, శాకాహార ఆహారం మొదలైన వివిధ ఆహారాలు బరువును తగ్గించుకునే జాబితాలో ఉన్నాయి. సాధారణంగా పురుషులకు బరువు తగ్గడం అంత సులభం కాదనే చెప్పాలి. ఎందుకంటే వారు రోజు వారిగా వివిధ రకాల పనుల్లో నిమగ్నమై ఉంటారు. దీని వల్ల బరువు తగ్గటంపై పెద్దగా దృష్టి సారించలేకపోవచ్చు. అలాంటి వారు సమర్థవంతంగా బరువు తగ్గడానికి 5 టిప్స్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక అనేది చాలా ముఖ్యమైనది. బరువు తగ్గడానికి అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయని మనందరికీ తెలుసు. డైటింగ్ సమస్య స్వల్పకాలమైనది. దీని వల్ల తక్షణ ఫలితాలను పొందవచ్చు, అయితే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం సాధ్యపడకపోవచ్చు. బరువు తగ్గించే ఆహారాలు కొన్ని సందర్భాల్లో శరీరానికి పోషకాలు లభించకుండా నియంత్రిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోసం పరిమితమైన పోషకాలతో కూడిన ఆహార ప్రణాళికను రూపొందించుకోవాలి.

2. ఆకలి , రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి కొద్ది మోతాదులో ఆహారం తీసుకోవాలి. భోజనం తినకుండా మానేయటం అన్నది నిజానికి ఆరోగ్యకరమైనది కాదు. అలా చేయటం వల్ల బాగా ఆకలి వేసి ఎక్కువ మొత్తంలో తినే పరిస్ధితి ఎదురవుతుంది. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి తినడానికి ప్రయత్నించాలి, ఇది మీ ఆకలిని నియంత్రించేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. అల్పాహారం ఉదయం 8గంలకు, భోజనం మధ్యాహ్నం 12గంటలకు, ఆరోగ్యకరమైన చిరుతిండి మధ్యాహ్నం 3గంటలకు, రాత్రి భోజనం – సాయంత్రం 6:30గంలకు తీసుకోవటం మంచిది.

3.రోజువారిగా తీసుకునే భోజనంలో సమతుల్య ఆహారం తీసుకోవటం ఉత్తమం. బరువు తగ్గాలనుకుంటే, మీరు తీసుకునే ప్రతి భోజనంలో పోషకాలను సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. 40% ప్రోటీన్లు, 35% పిండి పదార్థాలు మరియు 25% ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండాలి. ఇవి రొటీన్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఆకలిని అణిచివేయటంలోనూ తోడ్పడతాయి. జీవక్రియను కూడా పెంచుతాయి. ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. అవి పరిమిత పరిమాణంలో ఉంటే బరువు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సంపూర్ణత్వం యొక్క అనుభూతిని, శక్తిని అందించడానికి మంచి కార్బోహైడ్రేట్లు అవసరం.

4. ఎక్కువ నీరు త్రాగటం ఏమాత్రం మర్చిపోకూడదు. నీరు తీసుకోవడం శరీరానికి చాలా కీలకం. ఇది మీ ఆరోగ్యంపై అనేక సానుకూల ప్రయోజనాలను కలిగిస్తుంది. నీటి వినియోగాన్ని పెంచడం వలన శరీర విధులు సరైన స్థాయిలో పని చేస్తాయి. బరువు తగ్గించే ప్రయాణంలో కూడా ఇది చాలా కీలకం. క్రమం తప్పకుండా ఎక్కువ నీరు త్రాగితే డీహైడ్రేషన్ ఉండదు. తలనొప్పి, అలసట, నీరసం, గందరగోళం వంటి వాటిని నివారించటానికి శరీరానికి సరిపడినంత నీరు అందించటం అవసరం.

5. రోజువారీ శారీరక శ్రమ కోసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. కేలరీలను బర్న్ చేయడానికి శారీరక వ్యాయామం చాలా ముఖ్యం. బరువు తగ్గడం సంక్లిష్టమైన వ్యాయామాల ద్వారా మాత్రమే సాద్యమౌతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే రోజుకు అరగంట సమయం వ్యాయామాలకు కేటాయిస్తే సరిపోతుంది. తోటపని, ఇంటి పని, కుక్క తీసుకుని నడవడం, సైకిల్ తొక్కడం వంటి వాటికి సంబంధించిన పనులు కూడా చేయవచ్చు. ని కావచ్చు.