5G Network: ఫైనల్ స్టేజికి చేరుకున్న 5జీ నెట్‌వర్క్ పనులు

5G నెట్ వర్క్ పనులు ఫైనల్ దశకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నారు. ఇండియా టెలికాం 2022 బిజినెస్ ఎక్స్‌పో వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇండియా ఎలక్ట్రానిక్స్ తయారీలో...

5G Network: ఫైనల్ స్టేజికి చేరుకున్న 5జీ నెట్‌వర్క్ పనులు

5g Starts

5G Network: 5G నెట్ వర్క్ పనులు ఫైనల్ దశకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నారు. ఇండియా టెలికాం 2022 బిజినెస్ ఎక్స్‌పో వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇండియా ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రధాన దిగ్గజంగా మారింది.

‘4G కోర్ & రేడియో నెట్‌వర్క్‌ను స్వదేశీయంగా అభివృద్ధి చేసింది ఇండియా. 5G నెట్‌వర్క్ అభివృద్ధి చివరి దశలో ఉంది. మనదేశం ఈ రోజు 6G ప్రమాణాల అభివృద్ధిలో, 6G ఆలోచనా ప్రక్రియలో పాల్గొంటుంది’

‘ఇండియాలో ఇవాల్టి రోజున ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ 75 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మేజర్ సెమీకండక్టర్ ప్రోగ్రాంను లాంచ్ చేయగలిగింది. ఎట్టకేలకు 85వేల సెమీకండక్టర్ ఇంజినీర్లను లాంచ్ చేయనున్నాం’ అని మంత్రి అన్నారు.

Read Also: 10 వేల థియేటర్లలో రాధేశ్యామ్.. ఏంటి నిజమా?

ఈ ఈవెంట్ 45దేశాలకు చెందిన క్వాలిఫైడ్ కొనుగోలుదారులు పాల్గొన్నారు. కాన్ఫిరెన్స్ మాత్రమే కాకుండా 40 ఇండియన్ టెలికాం కంపెనీలు వారి ప్రొడక్ట్ లు, వాటి సామర్థ్యాలను ఎగ్జిబిషన్ లో చూపించారు.

‘పారదర్శకత, జవాబుదారీతనం మన ప్రజాస్వామ్యాన్ని శక్తివంతంగా చేస్తాయి. సామాజిక-ఆర్థిక మార్పులకు తొలి అడుగు. ప్రభుత్వం 6 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్‌ను అందించే ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించింది. 2.6 లక్షల గ్రామాలకు ఇప్పటికే అందించాం. టెలికాం శాఖ 2025 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని యోచిస్తోంది’ అని చౌహాన్ చెప్పారు.