Bihar: నకిలీ మద్యం తాగి ఏడుగురు మృతి, కంటిచూపు కోల్పోయిన చాలా మంది

ఏప్రిల్ 2016 నుంచి బీహార్‌లో మద్యం అమ్మకం, వినియోగం పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ రాష్ట్రంలో మద్యం స్వైర విహారం చేస్తూనే ఉంది. ఈ విషయమై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర రగడ చెలరేగింది. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭పై విపక్ష భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

Bihar: నకిలీ మద్యం తాగి ఏడుగురు మృతి, కంటిచూపు కోల్పోయిన చాలా మంది

7 dead after consuming spurious liquor in Bihar

Bihar: మద్య నిషేధం ఉన్న బిహార్‭లో మద్యం అమలులో ఉన్న చాలా రాష్ట్రాల కంటే ఎక్కువగా మద్యం ఏరులై పారుతోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక సర్వే కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అధికార-విపక్షాల మధ్య తరుచూ ఈ విషయమై వాదప్రతివాదాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక లిక్కర్ స్వైర విహారానికి తోడు నకిలీ లిక్కర్ కూడా తోడైంది. చాలా చోట్ల నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయంతో తగినంత చొరవ చూపించినట్లు లేదు. తాజాగా నకిలీ మద్యం తాగి ఏడుగురు బిహారీలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది కంటిచూపు కోల్పోయారు. రాష్ట్రంలోని ఛప్రా ప్రాంతంలో వెలుగు చూసిందీ ఘటన.

Faridabad: లంచం తీసుకున్న డబ్బు మింగేందుకు ప్రయత్నించిన ఎస్ఐ.. అడ్డుకున్న అధికారులు.. వీడియోలో రికార్డ్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇషావ్‌పూర్‌లో మంగళవారం సాయంత్రం మద్యం సేవించిన అనంతరం వారి ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించి విచారణ ప్రారంభించారు. అయితే నకిలీ మద్యం సేవనం గురించి సమాచారం తెలుసుకుని, విచారణ చేపట్టగా ఆ నకిలీ మద్యమే వారి ప్రాణాల మీదకు వచ్చినట్లు తెలిపారు. మరణాలు ఇంకా పెరుగుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. మరింత పక్కా సమాచారం కోసం చనిపోయిన వారిని పోస్టుమార్టం కోసం పంపినట్లు, ఆరోగ్యం క్షీణించిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మాదేపూర్ డీఎస్పీ ఈ విషయమై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు.

Bernard Arnault: ప్రపంచంలో అత్యంత ధనవంతుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎవరు? ఏ వ్యాపారం చేస్తాడు? మస్క్‌ని ఎలా అధిగమించాడు!

ఏప్రిల్ 2016 నుంచి బీహార్‌లో మద్యం అమ్మకం, వినియోగం పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ రాష్ట్రంలో మద్యం స్వైర విహారం చేస్తూనే ఉంది. ఈ విషయమై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర రగడ చెలరేగింది. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭పై విపక్ష భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో సహనం కోల్పోయిన నితీశ్.. ‘‘ఏమైంది? తాగి అసెంబ్లీకి వచ్చారా’’ అంటూ విపక్షాలను ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు.