Boy Courage Snake Bite : భళా బుడ్డోడా.. కాటేసిన పామునే ఆస్పత్రికి పట్టుకెళ్లాడు!

వయస్సు ఏడేళ్లే.. కానీ, సాహసవీరుడు.. ధైర్యానికి మారుపేరు.. తనను కరిచింది విషపు పాము.. అయినా అతడు బెదరలేదు.. అదరలేదు.. ధైర్యంగా ఆ పామును వెంటాడాడు. చివరికి చంపేశాడు. చచ్చిన పామును పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు.

Boy Courage Snake Bite : భళా బుడ్డోడా.. కాటేసిన పామునే ఆస్పత్రికి పట్టుకెళ్లాడు!

7 Year Old Boy’s Quick Wit And Courage Saves His Life From Russell's Viper Bite

Boy Courage Snake Bite : వయస్సు ఏడేళ్లే.. కానీ, సాహసవీరుడు.. ధైర్యానికి మారుపేరు.. తనను కరిచింది విషపు పాము.. అయినా అతడు బెదరలేదు.. అదరలేదు.. ధైర్యంగా ఆ పామును వెంటాడాడు. చివరికి చంపేశాడు. చచ్చిన పామును పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. ఈ పాము నన్ను కరిచింది అంటూ వైద్యులకు చూపించాడు. ఏమాత్రం అధైర్యపడకుండా చికిత్స చేయించుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టలో జరిగింది. రాము కుమారుడు దర్షిత్‌ (7) మూడో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 16వ తేదీన వెల్‌లైకోట్టై గ్రామంలోని అవ్వ వద్దకు వెళ్లాడు. పొలంలో ఆడుకుంటున్న సమయంలో ఏదో కరిచినట్లుగా అనిపించింది. వెంటనే అదేంటో వెతికాడు.. పక్కనే రక్తపింజరి జాతి పాము కనిపించింది.

కానీ, ఆ బుడ్డోడు ఏమాత్రం బయపడలేదు. పోలంలోకి పాకుతున్న పామును వెంటాడి పట్టుకున్నాడు. రాళ్లతో కొట్టి పామును చంపేశాడు. ఆ పామును చేత్తో పట్టుకుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చూపించాడు. అనంతరం కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. విషపు పాము కరిచినా బాలుడిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షించారు. ఆ తర్వాత బాలుడి కాలు ఉన్నట్టుండి బాగా వాచిపోయింది.

ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం దర్షిత్ కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా బాలుడిని ఆస్పత్రి వైద్యులు పామును ఎందుకు తీసుకొచ్చావు అని అడిగారు.. అందుకు అతడు.. తనను ఏ పాము కరిచిందో తెలిస్తే కదా.. మీరు ట్రీట్ మెంట్ చేయగలిగేది అన్నారు. అంతే.. వైద్య బృందం అతడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.