Omicron : తెలంగాణలో 9కి చేరిన ఒమిక్రాన్ కేసులు..హన్మకొండ మహిళకు వైరస్

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోకరికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

Omicron : తెలంగాణలో 9కి చేరిన ఒమిక్రాన్ కేసులు..హన్మకొండ మహిళకు వైరస్

Omicron (6)

Telangana Omicron : తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోకరికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. యూకే నుంచి వచ్చిన హన్మకొండ మహిళకు ఒమిక్రాన్ వైవైరస్ సోకిందని, మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు వెల్లడించారు. 2021, డిసెంబర్ 17వ తేదీన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఎయిర్ పోర్టుకు వచ్చి..వైరస్ బారిన పడిన 9 కేసుల్లో ఎవ్వరికి ఎలాంటి లక్షణాలు లేవని, UKలో తప్పితే ఎక్కడా మరణాలు సంభవించలేదని స్పష్టం చేశారు.

Read More : India Omicron : గేరు మార్చిన ఒమిక్రాన్…98 కేసులు..ఢిల్లీలో ఒక్కరోజే 10 కేసులు

వెస్ట్ బెంగాల్ కి ఒకరు వెళ్లిపోయారని, సామాజిక వ్యాప్తి మాత్రం జరగలేదని చెప్పిన ఆయన డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 76, 764 మందిని స్క్రీన్ చేయడం జరిగిందన్నారు. వైరస్ 50 రకాలుగా మ్యూటెంట్ మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. ఈ రెండు రోజుల్లో హాట్ స్పార్ట్ ఏరియాల్లో 600 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. వైరస్ వచ్చిన వారు స్వీయ నియంత్రణలోనే ఉండాలని ఆయన సూచించారు. ఇక కరోన వ్యాక్సిన్ విషయానికి వస్తే…97 శాతం మందికి మొదటి డోస్, 11 జిల్లాల్లో వంద శాతం వేయడం జరిగిందన్నారు. సెకండ్ డోస్ కేవలం 56 శాతం మంది మాత్రమే వేసుకున్నట్లు, 28 లక్షల మందికి రెండో డోస్ వేయాల్సి ఉందన్నారు డీహెచ్ శ్రీనివాసరావు.