India Omicron : గేరు మార్చిన ఒమిక్రాన్…98 కేసులు..ఢిల్లీలో ఒక్కరోజే 10 కేసులు

కరోనా తగ్గుముఖం పడుతున్నదని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. దేశంలో కాలుపెట్టిన ఒమిక్రాన్ ఒక్కసారిగా యావత్‌ దేశాన్నీ ఊపిరి బిగపట్టేలా చేసింది.

India Omicron : గేరు మార్చిన ఒమిక్రాన్…98 కేసులు..ఢిల్లీలో ఒక్కరోజే 10 కేసులు

Omicron Variant Cases In India

India Omicron : దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గేరు మార్చింది. దేశలంలో ఒమిక్రాన్ కేసులు సెంచరీకి చేరువయ్యాయి. ఢిల్లీలో ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 20కు చేరాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 98 ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. భారత్‌ను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నాయి.

Read More : Selfie With Dog : సెల్ఫీ దిగుతుండగా దాడి చేసిన కుక్క.. యువతికి తీవ్ర గాయాలు

కరోనా తగ్గుముఖం పడుతున్నదని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. దేశంలో కాలుపెట్టిన ఒమిక్రాన్ ఒక్కసారిగా యావత్‌ దేశాన్నీ ఊపిరి బిగపట్టేలా చేసింది. చిన్న పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు ఈ వేరియంట్‌. 2 కేసులతో మొదలైన ఒమిక్రాన్ అలజడి.. మొన్న హాఫ్‌సెంచరీ ఉండగా…2021, డిసెంబర్ 17వ తేదీ శుక్రవారానికి 100 కేసులకు రీచ్‌ అయింది. కర్ణాటకలో మొదలైన ఒమిక్రాన్‌ కౌంట్‌.. ప్రస్తుతం దేశంలోని 11 రాష్ట్రాలకు వ్యాపించింది. అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

Read More : Pushpa : ‘పుష్ప’ బెనిఫిట్ షో వేయలేదని థియేటర్ పై దాడి చేసిన ఫ్యాన్స్

వ్యాక్సిన్లతో వైరస్‌కు ముకుతాడు వేశామని ఊరట చెందుతున్న సమయంలో ఒమిక్రాన్‌ రూపంలో కరోనా కోరలు చాస్తోంది. దేశ దేశాల్లో పాగా వేస్తోన్న ఈ సూపర్‌ స్ప్రెడింగ్‌ వేరియంట్‌ మన దేశంలో అడుగు పెట్టిన కొద్దీ రోజులకే 98 మందికి సోకడం ఆందోళనకరం. కరోనా తొలిరూపంతో పాటు డెడ్లీ డెల్టా వేరియంట్‌లు ఇంకా పీడిస్తూనే ఉన్న సమయంలో ఒమిక్రాన్‌ వాటికి తోడవడంతో పరిస్థితులు ముందుముందు ఎంత దిగజారుతాయోనన్న ఆందోళన నెలకొంది. 10 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడంతో అన్ని రాష్ర్టాలూ భయం గుప్పిట్లో బతుకుతున్నాయి.