PM Modi: మోదీకి గిఫ్ట్‌గా చీర.. మీరు చూశారా

పద్మ శ్రీ అవార్డు గ్రహీత, బెంగాల్ లెజెండరీ నేత కార్మికుడు ప్రధాని మోదీకి చీరను బహుకరించారు. దేశ పౌరులతో పాటు మోదీ బొమ్మను ఆ చీరపై డిజైన్‌లా రూపొందించారు.

PM Modi: మోదీకి గిఫ్ట్‌గా చీర.. మీరు చూశారా

Pm Modi

Updated On : November 13, 2021 / 3:12 PM IST

PM Modi: పద్మ శ్రీ అవార్డు గ్రహీత, బెంగాల్ లెజెండరీ నేత కార్మికుడు ప్రధాని మోదీకి చీరను బహుకరించారు. దేశ పౌరులతో పాటు మోదీ బొమ్మను ఆ చీరపై డిజైన్‌లా రూపొందించారు. తాను అందుకున్న బహుమతి గురించి మోదీ స్వయంగా ట్విట్టర్ ద్వారా స్పందించి థ్యాంక్స్ చెప్పారు.

‘వెస్ట్ బెంగాల్ లోని నదియా ప్రాంతానికి చెందిన వ్యక్తి శ్రీ బిరేన్ కుమార్ బసక్. చేనేత వృత్తి కల ఈయన భారత చరిత్ర, సంప్రదాయాలను చీరలపై ప్రతిబింబిస్తారు. పద్మ అవార్డీలతో ఇంటరాక్ట్ అయిన సందర్భంగా నాకు దీనిని బహుకరించాడు. ఇంతటి విలువైన దానిని అందించాడు’ అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

‘ప్రతి రోజూ ఉదయం ట్రైన్ లో కోల్ కతాకు వెళ్లి వీధుల్లో తిరుగుతూ మా అన్న, నేను చీరలు అమ్మేవాళ్లం. నిదానంగా మా వ్యాపారాన్ని పెంచుకుంటూ వచ్చాం. అప్పట్లో చీరల ఖరీదు రూ.15 నుంచి రూ.35వరకూ మాత్రమే ఉండేవి’

……………………………………..: లాలా భీమ్లా.. జనవరిలోనా.. వాయిదానా?

‘ప్రస్తుతం 5000మంది నేత శ్రామికులతో పనిచేస్తున్నాం. అందులో 2వేల మంది మహిళలే. వారు సొంతగా సంపాదించుకోవడానికి అలవాటుపడ్డారు. నిజానికి ఈ అవార్డు వారి వల్లే వచ్చింది. వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం’ అని మీడియాతో అన్నారు.

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ, ఆశా బోస్లే, లతా మంగేశ్కర్, సత్యజిత్ రే, హేమంత ముఖోపాధ్యాయ్ లాంటి వాళ్లు కూడా ఆయన కస్టమర్లే. యూకే బేస్డ్ వరల్డ్ రికార్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న ఆయన 2013లో స్కిల్ అండ్ క్రాఫ్ట్ మన్ షిప్ కు నేషనల్ అవార్డు అందుకున్నారు.

……………………………………………..: చెన్నైకి మరో గండం.. ఊహించని స్థాయిలో వర్షాలు!