Aaditya Thackeray: ఇది సత్యానికి, అసత్యానికి మధ్య యుద్దం: ఆదిత్యా థాక్రే

ఇది సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నమ్మక ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పోరాటంలో శివసేనే గెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్య థాక్రే, తండ్రితోపాటే అధికారిక బంగ్లా అయిన ‘వర్ష’లోనే ఉండేవారు.

Aaditya Thackeray: ఇది సత్యానికి, అసత్యానికి మధ్య యుద్దం: ఆదిత్యా థాక్రే

Aaditya Thackeray

Aaditya Thackeray: ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న యుద్ధమని అభిప్రాయపడ్డారు రాష్ట్ర మంత్రి, ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్యా థాక్రే. శనివారం జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత ఆదిత్యా థాక్రే మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నమ్మక ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పోరాటంలో శివసేనే గెలుస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్య థాక్రే, తండ్రితోపాటే అధికారిక బంగ్లా అయిన ‘వర్ష’లోనే ఉండేవారు. అయితే, ఉద్ధవ్ థాక్రే ఆ నివాసాన్ని ఖాళీ చేసి, సొంత నివాసమైన మాతో శ్రీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Uddhav Thackeray: బాలాసాహెబ్ పేరు వాడుకోవద్దు: రెబల్స్‌కు ఉద్ధవ్ వార్నింగ్

దీంతో ఉద్ధవ్‌తోపాటు ఆదిత్య థాక్రే కూడా మాతోశ్రీకి వెళ్లారు. శనివారం జరిగిన సమావేశంలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ఏక్‌నాథ్ షిండేతోపాటు, తిరుగు బాటు చేసిన ఎమ్మెల్యేలు అందరిపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఉద్ధవ్ తనయుడు ఆదిత్య రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతుంటే, ఏక్‌నాథ్ షిండే కొడుకు శివసేన తరఫున ఎంపీగా గెలిచాడు.