Aahana Kumra: ఫోటో దిగుతూ బాలీవుడ్ న‌టిపై అక్క‌డ చేయి వేసిన అభిమాని.. ఆ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..?

ఓ అభిమాని చ‌ర్య బాలీవుడ్ న‌టికి కోపం తెప్పించింది. వెంట‌నే స‌ద‌రు అభిమానిపై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆమె మ‌రెవ‌రో కాదు అహనా కుమ్రా

Aahana Kumra: ఫోటో దిగుతూ బాలీవుడ్ న‌టిపై అక్క‌డ చేయి వేసిన అభిమాని.. ఆ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..?

Aahana Kumra Gets Uncomfortable

Aahana Kumra gets angry: సినీతార‌లకు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఎక్క‌డైనా వారు క‌నిపించ‌గానే అభిమానులు వారిని చుట్టుముట్టేసి సెల్ఫీలు, వీడియోలు తీసుకోవ‌డం వంటివి స‌ర్వ‌సాధార‌ణంగా చూస్తూనే ఉంటాం. అభిమానం హ‌ద్దులు దాట‌నంత వ‌ర‌కు ఓకే కానీ.. దాటితే మాత్రం ఇబ్బందులు త‌ప్ప‌వు. కొన్ని సార్లు ఫ్యాన్స్ చేసే ప‌నుల కార‌ణంగా సినీ తార‌లు ఇబ్బందులు ప‌డిన ఘ‌ట‌న‌ల‌ను చూశాం.

తాజాగా ఓ అభిమాని చ‌ర్య బాలీవుడ్ న‌టికి కోపం తెప్పించింది. వెంట‌నే స‌ద‌రు అభిమానిపై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆమె మ‌రెవ‌రో కాదు అహనా కుమ్రా(Aahana Kumra). ‘యుధ్’ అనే టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కుమ్రా.. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’, ‘ఇండియా లాక్ డౌన్’ వంటి చిత్రాల్లో న‌టించి అభిమానుల గుండెల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది.

NTR : ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ థ్యాంక్స్.. ఎలా చెప్పాడో తెలుసా?

అహ‌నా కుమ్రా ఇటీవ‌ల ముంబై న‌గ‌రంలో జ‌రిగిన ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ వార్షికోత్స‌వంలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు అభిమానులు న‌టితో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. వారిని నిరుత్సాహ‌ప‌ర‌చ‌డం ఇష్టంలేని ఆమె ఇందుకు ఒకే చెప్పింది. ఒక్కొక్క‌రుగా వ‌చ్చి అహానాతో ఫోటోలు దిగుతున్నారు. ఓ అభిమాని ఆమెతో ఫోటో దిగే క్ర‌మంలో ఆమె న‌డుముపై చేయి వేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra)

ఊహించ‌ని ఈ చ‌ర్యతో మొద‌ట కాస్త కంగారుప‌డినా ఆ త‌రువాత వెంట‌నే తేరుకుంది. ‘డోంట్ ట‌చ్ మీ’ అంటూ కోపంగా చెప్పింది. ఈ ఘ‌ట‌న కార‌ణంగా అహనా అక్క‌డ నుంచి వెంట‌నే వెళ్లిపోతుంద‌ని బావించిన‌ప్ప‌టికి మిగిలిన వారిని హ‌ర్ట్ చేయ‌డం ఇష్టం లేని ఆమె అందరితో ఫోటోలు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

Thalapathy68 : తలపతి విజయ్ నెక్స్ట్ సినిమా ఫిక్స్.. కస్టడీ డైరెక్టర్ తోనే..

ఈ ఘ‌ట‌న‌పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. ఎవ‌రినైనా ప‌రిష్మ‌న్ లేకుండా తాకడం త‌ప్ప‌ని కామెంట్లు పెడుతున్నారు. అహానా కుమ్రా చేసిన దాంట్లో త‌ప్పేమీ లేద‌ని న‌టికి మ‌ద్ద‌తుగా కామెంట్లు పెడుతున్నారు. అభిమానం హ‌ద్దుల్లో ఉండాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.