Arvind Kejriwal: బీజేపీకి గూండాలు, రేపిస్టులు కార్యకర్తలుగా కావాలి: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు

‘‘తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలనుకునేవాళ్లు మాతో రండి.. అల్లరిమూకలు, గూండాలు, రేపిస్టులు కావాలనుకునేవాళ్లు వారితో (బీజేపీ) వెళ్లండి..ఇలాంటి అంశాలన్నీ ఆ పార్టీలో ఉన్నాయి." అంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు

Arvind Kejriwal: బీజేపీకి గూండాలు, రేపిస్టులు కార్యకర్తలుగా కావాలి: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు

Kejri

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్..మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి గుండాలు, రేపిస్టులు కార్యకర్తలుగా కావాలని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రచార కార్యక్రమాలను ఆదివారం హర్యానా నుంచి ప్రారంభించారు. హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమంలో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని అధికార బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ‘‘తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలనుకునేవాళ్లు మాతో రండి.. అల్లరిమూకలు, గూండాలు, రేపిస్టులు కావాలనుకునేవాళ్లు వారితో (బీజేపీ) వెళ్లండి..ఇలాంటి అంశాలన్నీ ఆ పార్టీలో ఉన్నాయి.” అంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఢిల్లీలోని తన నివాసం పై రాళ్లు రువ్విన నిరసనకారులను ఢిల్లీ బీజేపీ నేతలు సన్మానించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.

other stories: Kanpur Mayor: దేవాలయాల స్థలాలు ఆక్రమించి బిర్యానీ షాపులు: పరిస్థితి చూసి చలించిపోయిన నగర మేయర్

ఇటీవల హర్యానాలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవడంపై స్పందించిన కేజ్రీవాల్..పరీక్ష పేపర్ లీకేజీని అడ్డుకోలేని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్..ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపించగలరంటూ ఎద్దేవా చేశారు. “ఆప్ కచ్చితమైన నిజాయితీగల పార్టీ. ఎంత నిజాయితీ పార్టీ అంటే నా కొడుకు తప్పు చేసినా నేను అతనిని విడిచిపెట్టను” అని కేజ్రీవాల్ అన్నారు. అయితే సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సీఎం..తన స్థాయి మరచి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా బీజేపీ కార్యకర్తలు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం నిర్వహించిన కురుక్షేత్రలో కాంగ్రెస్, బీజేపీ సైతం ఆదివారం ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా అధికార బీజేపీ ముందుకు వెళుతుంటే..ప్రభుత్వంలో ఉన్న పాలనా లోపాలను ఎత్తి చూపుతూ ప్రతిపక్షాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి.

other stories: S. Jaishankar: మయాన్మార్, బంగ్లాదేశ్ రవాణా మార్గాలు తెరిస్తే ఆసియలో పెను మార్పులు తధ్యం: భారత విదేశాంగ మంత్రి