Kanpur Mayor: దేవాలయాల స్థలాలు ఆక్రమించి బిర్యానీ షాపులు: పరిస్థితి చూసి చలించిపోయిన నగర మేయర్

ఈ పర్యటన సందర్భంగా.. ముస్లింల ప్రాభల్యం అధికంగా ఉండే బెకన్‌గంజ్ మరియు చమన్‌గంజ్ ప్రాంతాల్లోని హిందూ దేవాలయాల ప్రాంగణాలు ఆక్రమణకు గురైనట్లు మేయర్ ప్రమీలా పాండే గుర్తించారు.

Kanpur Mayor: దేవాలయాల స్థలాలు ఆక్రమించి బిర్యానీ షాపులు: పరిస్థితి చూసి చలించిపోయిన నగర మేయర్

Kanpur

Kanpur Mayor: ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో మందిర్ – మసీదుల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హిందూ దేవాలయాలను ఆక్రమించి వాటిపై మసీదులు నిర్మించారన్న వాదనలతో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రముఖ మసీదుల ఆవరణలో హిందూ దేవతల విగ్రహాలు, ఆలయాలు ఉండేవంటూ..పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఆయా ప్రాంతాల్లో భద్రతపై ప్రభుత్వాలు సైతం గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ఈక్రమంలోనే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలోనూ..పలు దేవాలయాల స్థలాలు ఆక్రమణకు గురయ్యాయన్నఫిర్యాదుల నేపథ్యంలో నగర మేయర్ ప్రమీలా పాండే శనివారం ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా.. ముస్లింల ప్రాభల్యం అధికంగా ఉండే బెకన్‌గంజ్ మరియు చమన్‌గంజ్ ప్రాంతాల్లోని హిందూ దేవాలయాల ప్రాంగణాలు ఆక్రమణకు గురైనట్లు మేయర్ ప్రమీలా పాండే గుర్తించారు.

other stories: Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్‌లో గ్ర‌హాంత‌ర వాసులు ఉన్నారా?

అన్వర్ గంజ్ ఏసీపీ సహా.. మరో 7 పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి శనివారం 7 పురాతన దేవాలయాలను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో గతంలో ఉన్న 124 చిన్నా పెద్ద దేవాలయాలు ఆక్రమణకు గురైనట్లు మేయర్ ప్రమీలా పాండే పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన దేవాలయ ప్రాంగణాల్లో బిర్యానీ షాపులు వెలిశాయని..శుచిశుభ్రత లేకుండా ఎక్కడి చెత్త అక్కడే ఉన్నట్లు ప్రమీలా పాండే తెలిపారు. దేవాలయాలన్నీ శిథిలమైపోగా, ఇవన్నీ కూడా అక్రమంగా ఆక్రమించుకున్నవేనని ఆమె తెలిపారు. ఈ తనిఖీల సందర్భంగా బెకన్‌గంజ్ లో ప్రముఖ బిర్యానీ షాపులైన బాబా బిర్యానీ మరియు చాంద్ బిర్యానీ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. వీరిలో బాబా బిర్యానీ దుకాణ యజమాని.. స్థానికంగా భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు..గతంలోనూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

other stories: Char Dham Yatra: 25 రోజుల్లో 99 మంది చార్‌ధామ్ యాత్రికులు మృతి.. ఎందుకిలా జ‌రుగుతుందంటే..

ఇప్పటికే కోర్టు కేసులో ఉన్న ఒక స్థలంలో గతంలో జానకీ మాత(సీతా దేవి) దేవాలయం ఉండేదని..ఆ ఆలయాన్ని ఆక్రమించిన కొందరు వ్యక్తులు..అక్కడ బిర్యానీ షాప్ తెరిచినట్లు అధికారులు నివేదించారు. కాగా, హిందూ దేవాలయా ప్రాంగణాలు ఆక్రమణకు గురై..అక్కడ బిర్యానీ షాపులు వెలియడం, ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడం పట్ల మేయర్ ప్రమీల పాండే ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ ప్రాంగణాల ఆక్రమణపై వారంలోగా నివేదిక ఇవ్వాలని స్థానిక యంత్రాంగాన్నీ ఆదేశించారు. అయితే కాన్పూర్ నగరంలో మేయర్ పర్యటన, దేవాలయాల ప్రాంగణాలు ఆక్రమణ విషయంపై ముస్లిం మత పెద్దలు స్పందిస్తూ..దేవాలయాలు ఆక్రమణకు గురయ్యాయనేది అవాస్తవమని అన్నారు.