S. Jaishankar: మయాన్మార్, బంగ్లాదేశ్ రవాణా మార్గాలు తెరిస్తే ఆసియలో పెను మార్పులు తధ్యం: భారత విదేశాంగ మంత్రి

"ఇది ఆసియాన్ దేశాలు మరియు జపాన్‌తో భారత్ కలిగి ఉన్న భాగస్వామ్యాన్ని పెంపొందించడమే కాకుండా, ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్న ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్‌కు మార్పును కలిగిస్తుంది."అని జైశంకర్ అన్నారు

S. Jaishankar: మయాన్మార్, బంగ్లాదేశ్ రవాణా మార్గాలు తెరిస్తే ఆసియలో పెను మార్పులు తధ్యం: భారత విదేశాంగ మంత్రి

Jaishankar

S. Jaishankar: ఇతర దేశాల్లో విధానాలు మరియు ఆర్థిక వ్యవస్థలు సరిగ్గా ఉంటేనే భారతదేశం భౌగోళికంగా చరిత్రను తిరిగి వ్రాయగలదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. వాణిజ్య స్థాయిలోమయన్మార్ ద్వారా ల్యాండ్ కనెక్టివిటీ మరియు బంగ్లాదేశ్ ద్వారా సముద్ర మార్గాలను తెరవడం ద్వారా, మనీలా టు ముంద్రా వరకు హైఫాంగ్ నుండి హజీరా వరకు..వియత్నాం మరియు ఫిలిప్పీన్స్ వరకు ప్రపంచ వాణిజ్యానికి సరికొత్త బాటలు వేస్తుందని ఎస్ జైశంకర్ అన్నారు. శనివారం అస్సాంలో జరిగిన నాడి 3 ఆసియా సంగమం రివర్ కాన్క్లేవ్ లో పాల్గొన్న ఆయన తూర్పు – పశ్చిమ దేశాలను కలిపితే ఆసియ ఖండంలో విస్తృత ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. “ఇది ఆసియాన్ దేశాలు మరియు జపాన్‌తో భారత్ కలిగి ఉన్న భాగస్వామ్యాన్ని పెంపొందించడమే కాకుండా, ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్న ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్‌కు మార్పును కలిగిస్తుంది.”అని జైశంకర్ అన్నారు. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ బంగ్లాదేశ్ తో అనుసంధానం పెంపొందించడంలో భాగంగా 1965 నుంచి నిరుపయోగంలో ఉన్న 6 సరిహద్దు రైలు లింకులను పునరుద్ధరించాలని జైశంకర్ ప్రతిపాదించారు.

other stories: Nepal Dispute: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న నేపాల్: కలాపాని, లిపులేఖ్‌లు తమ భూభాగమే అంటూ కొత్త ప్రధాని వాదన

ఇది కార్యరూపం దాల్చితే..షహబాజ్‌పూర్ (బంగ్లాదేశ్) నుండి మహిషాసన్ (అస్సాం) లింకును బంగ్లాదేశ్‌లో మరింత విస్తరించి..ప్రస్తుతం ఆధునీకరించబడుతున్న కులుారా-షాబాజ్‌పూర్ రైలు మార్గానికి అనుసంధానించబడుతుందని జైశంకర్ అన్నారు. డిసెంబర్ 2020లో ప్రారంభించబడి ప్రస్తుతం అస్సాం వరకు ఉన్న చిలహతి-హల్దిబారి (పశ్చిమ బెంగాల్)రైల్వే లైన్ ను మరింత విస్తరించడం ద్వారా న్యూ జల్‌పైగురి మీదుగా బంగ్లాదేశ్‌ – అస్సాం మధ్య ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుందని విదేశాంగ మంత్రి చెప్పారు. అఖౌరా (బంగ్లాదేశ్) నుండి అగర్తల (త్రిపుర) మధ్య రైలు మార్గం అభివృద్ధి చేయబడుతోంది, దీని ఫలితంగా ఇప్పటికే భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం పెరిగిందని జైశంకర్ చెప్పారు.

other stories: Trading Partner: భారత్‌తో వ్యాపారం.. చైనాను దాటిన అమెరికా